Gyanvapi case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. శివలింగాకృతిని పరిరక్షించాలని ఆదేశం..

జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మసీదులోని శివలింగాకృతిని పరిరక్షించాలంటూ..

Gyanvapi case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. శివలింగాకృతిని పరిరక్షించాలని ఆదేశం..
Gyanvapi Case
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 5:43 PM

జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మసీదులోని శివలింగాకృతిని పరిరక్షించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. ప్రసిద్ద పుణ్యక్షేత్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడకు ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కొద్ది నెలల కిందట కోర్టులో కొంతమంది మహిళలు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌తో దేశమంతా కలకలం రేగింది. మహిళల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అక్కడి దృశ్యాల సర్వేకు ఆదేశించింది. ఈ సర్వేలో ఒక శివలింగం ఆకారం బయటపడింది. అయితే, ఇది శివలింగం అని అంగీకరించడానికి మసీదు నిర్వాహకులు ఒప్పుకోలేదు. ఈ అంశం సున్నితమైందంటూ, ఈ ప్రాంతాన్ని సీజ్‌ చేస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత మసీదు నిర్వాహకులు, హిందువులు వేసిన పిటిషన్లపై పలుసార్లు విచారణలు జరిగాయి. చివరకు 12 పేజీల సర్వే రిపోర్ట్‌ తర్వాత.. అక్టోబర్ 14న శివలింగాన్ని సురక్షితంగా పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీం ఆదేశానుసారం.. కార్బన్ డేటింగ్‌కు అనుమతించేది లేదని వారణాసి జిల్లా కోర్టు కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో మసీదులో విగ్రహాలను పూజించుకోవడానికి అనుమతించాలన్న హిందువుల పిటిషన్ పై విచారణను కూడా చేపట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ.. మసీదు కమిటీ అంజుమన్‌ ఇంతెజా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో..శివలింగం కార్బన్ డేటింగ్ పిటిషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. మరోవైపు, వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేసిన నలుగురు హిందూ మహిళలు.. శివలింగంపై కార్బన్ డేటింగ్ జరపాలని రివిజన్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. ఈ కేసులో స్పందించాలని మసీదు నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజియా కమిటీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 22న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే