AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanavapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు

జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే వజూఖానా ప్రాంతంలో సర్వేకు న్యాయస్థానం..

Gyanavapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు
Gyanavapi Case
Subhash Goud
|

Updated on: Jul 21, 2023 | 5:26 PM

Share

జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే వజూఖానా ప్రాంతంలో సర్వేకు న్యాయస్థానం అనుమతించలేదు. ముందుగా ఉన్న దేవాలయాన్ని కూలగొట్టి దానిపై మసీదు నిర్మించారా అన్న విషయాన్ని సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా ఈ సర్వే చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వేకు అనుమతించింది. నమాజ్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, అలాగే మసీదుకు ఎటువంటి నష్టం కలుగకుండా చూడాలని వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి AK విశ్వేషా తన తీర్పులో ప్రకటించారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరి దేవీని సంవత్సరం పొడవునా పూజించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నలుగురు మహిళా భక్తులు వేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో స్వయంభూ జ్యోతిర్లింగం ఉండేదని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మసీదు ప్రాంగణంలో గతేది మే 16న నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం లాంటి ఆకృతి లభించింది. అది శివలింగమని హిందువులు, కాదు అది వాటర్‌ ఫౌంటెయిన్‌ అని ముస్లింలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్‌ సర్వే చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ సంఘాల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్ స్వాగతించారు. ఈ కేసుకు సంబంధించి ఈ తీర్పు టర్నింగ్ పాయింట్‌ అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే