Fact Check: రేషన్ కార్డు ఉంటే కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్ ఇస్తోందా..? ఇందులో నిజమెంత?
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం వందలాది పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల వల్ల కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అది జనధన్ యోజన, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజనతో పాటు వివిధ రకాల ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు ప్రయోజనం..
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం వందలాది పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల వల్ల కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అది జనధన్ యోజన, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజనతో పాటు వివిధ రకాల ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. కేంద్రం ఈ పథకం కింద రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వనున్నట్లు దీని సారాంశం. అయితే ఈ సమాచారం నిజంగా నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందజేస్తుందని పేర్కొంటూ ఈ పోస్టు వైరల్ అవుతోంది. అంతేకాకుండా 10 వేల 200 రూపాయలు కూడా ఇస్తారు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులు రేషన్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి అంటూ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#YouTube चैनल Sarkari Vlog के वीडियो में दावा किया गया है कि ‘फ्री स्मार्टफोन योजना 2023’ के तहत केंद्र सरकार प्रत्येक परिवार के 2 सदस्यों को स्मार्टफोन लेने के लिए उनके खाते में ₹10,200 दे रही है#PIBFactCheck
▶️यह दावा फर्जी है
▶️ केंद्र सरकार ऐसी कोई योजना नहीं चला रही है pic.twitter.com/vbdVU1XY7U
— PIB Fact Check (@PIBFactCheck) July 13, 2023
ఈ వైరల్ అవుతున్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. పీఐబీ ప్రకారం.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ స్కీమ్‌లో ఎలాంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకం తీసుకురాలేదు. ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచురించిన యూట్యూబ్ ఛానెల్‌కు పిఐబి పేరు కూడా హెచ్చరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి