AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: సీనియర్‌ సిటిజన్లకు రైల్వే గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ఉండవు: రైల్వే మంత్రి

రైలులో ప్రయాణించే వారికి రైల్వే ఎప్పటికప్పుడు అనేక అప్‌డేట్‌లను అందిస్తోంది. ఇప్పుడు రైల్వే సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. మీరు కూడా సీనియర్ సిటిజన్, రైలులో ప్రయాణిస్తే, ఇప్పుడు మీరు రైల్వే నుంచి అనేక సౌకర్యాలను పొందవచ్చు..

Indian Railways: సీనియర్‌ సిటిజన్లకు రైల్వే గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ఉండవు: రైల్వే మంత్రి
Ashwini Vaishnaw
Subhash Goud
|

Updated on: Jul 21, 2023 | 5:30 AM

Share

రైలులో ప్రయాణించే వారికి రైల్వే ఎప్పటికప్పుడు అనేక అప్‌డేట్‌లను అందిస్తోంది. ఇప్పుడు రైల్వే సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. మీరు కూడా సీనియర్ సిటిజన్, రైలులో ప్రయాణిస్తే, ఇప్పుడు మీరు రైల్వే నుంచి అనేక సౌకర్యాలను పొందవచ్చు. రైల్వే శాఖ ద్వారా ప్రతిరోజూ 10,000 కంటే ఎక్కువ రైళ్లు నడుపుతోంది. వీటిలో దేశంలోని సీనియర్ సిటిజన్లు అనేక సౌకర్యాలను పొందుతున్నారని పార్లమెంటులో రైల్వే సమాచారం ఇచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో సీనియర్ సిటిజన్‌లకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి సమాచారం అందించారు.

సీనియర్ సిటిజన్లు రైలులో ధృవీకరించబడిన లోయర్ బెర్త్‌ల సౌకర్యాన్ని పొందుతున్నారని చెప్పారు. దీని కోసం రైల్వేలో ప్రత్యేక నిబంధన ఉంది. 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం ఏ ఎంపికను ఎంచుకోవాల్సిన అవసరం లేదని, ఈ ప్రయాణికులకు రైల్వే వైపు నుంచి ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ లభిస్తుందని అన్నారు.

గర్భిణీ స్త్రీలు కూడా ఈ సదుపాయాన్ని పొందుతారు:

రైల్వేల నుంచి అందిన సమాచారం ప్రకారం.. స్లీపర్ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు 6 లోయర్ బెర్త్‌లు రిజర్వ్ చేయబడ్డాయి. దీనితో పాటు 3 ఏసీలో ఒక్కో కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2ఏసీలో ఒక్కో కోచ్‌లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు కేటాయించారు.

ఇవి కూడా చదవండి

రైలు టికెట్ రాయితీపై రైల్వే మంత్రి మాట్లాడుతూ.. ఇది కాకుండా సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగులు, సిస్టమ్‌లో పై బెర్త్‌లు పొందిన మహిళలకు, రైలులో ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే ఆన్‌బోర్డ్ ద్వారా ఇవ్వడానికి నిబంధన రూపొందించారు.

ఎవరు ఎంత తగ్గింపు పొందేవారు?

రైల్వేలు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇంతకుముందు రైల్వేలు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు ఛార్జీలలో 40% తగ్గింపును ఇచ్చేవి. మరోవైపు మహిళలకు ఇచ్చే మినహాయింపు గురించి మాట్లాడితే.. ఈ వ్యక్తులు 58 సంవత్సరాల వయస్సు నుంచి 50 శాతం మినహాయింపు పొందారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధానితో సహా అన్ని రకాల రైళ్లలో ఈ తగ్గింపు పొందవచ్చని రైల్వే మంత్రి తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..