Baby Powder Company: ఈ బేబీ పౌడర్ కంపెనీకి భారీ షాకిచ్చిన కోర్టు.. రూ.154 కోట్ల జరిమానా!

పిల్లల చర్మం మృదువుగా ఉండేందుకు, చెమట నుంచి రక్షించడానికి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం మార్కెట్ నుండి బేబీ టాల్కమ్ పౌడర్ తీసుకువస్తుంటారు. మార్కెట్లో పేరెన్నికగన్న కంపెనీల అనేక బ్రాండ్లు బేబీ పౌడర్‌ను విక్రయిస్తాయి. కానీ ఈ ఉత్పత్తులు మీ బిడ్డపై ఇంత భయంకరమైన..

Baby Powder Company: ఈ బేబీ పౌడర్ కంపెనీకి భారీ షాకిచ్చిన కోర్టు.. రూ.154 కోట్ల జరిమానా!
Baby Powder
Follow us
Subhash Goud

|

Updated on: Jul 20, 2023 | 7:30 AM

పిల్లల చర్మం మృదువుగా ఉండేందుకు, చెమట నుంచి రక్షించడానికి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం మార్కెట్ నుండి బేబీ టాల్కమ్ పౌడర్ తీసుకువస్తుంటారు. మార్కెట్లో పేరెన్నికగన్న కంపెనీల అనేక బ్రాండ్లు బేబీ పౌడర్‌ను విక్రయిస్తాయి. కానీ ఈ ఉత్పత్తులు మీ బిడ్డపై ఇంత భయంకరమైన, చెడు ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలియదు. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ బేబీ పౌడర్ కంపెనీకి కోర్టు ఝలక్ ఇచ్చింది. రూ.154 కోట్ల జరిమానా విధించారు. ఈ సంస్థ ఉత్పత్తి కారణంగా క్యాన్సర్‌ ప్రమాదం పొంచి ఉందన్న ఆరోపణ ఉంది. ఇంతకుముందు మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఈ కంపెనీ ఉత్పత్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఉత్పత్తి నిలిపివేయాలని కంపెనీని ఆదేశించింది. దీనిపై కంపెనీ హైకోర్టు తలుపు తట్టింది.

ఈ కంపెనీ ఏమిటి?

ఇది గ్లోబల్ బ్రాండ్ కంపెనీ అయిన జాన్సన్ అండ్‌ జాన్సన్ విషయంలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కంపెనీ పిల్లల కోసం టాల్కమ్ పౌడర్‌ను తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే ఓ కేసులో అమెరికా కోర్టు ఈ కంపెనీకి 154 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ ఉత్పత్తి క్యాన్సర్‌కు కారణమైందని ఓ వ్యక్తి ఆరోపించారు. ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వాపోయారు.

అసలు విషయం ఏంటి?

ఈ కేసు అమెరికాలో ఉంది. ఆంథోనీ హెర్నాండెజ్ వాలాడెజ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ వ్యక్తి వాదన ప్రకారం.. అతను చిన్నప్పటి నుంచి ఈ కంపెనీ బేబీ పౌడర్‌ను ఉపయోగిస్తున్నాడు. అయితే ఆ తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. టాల్కమ్ పౌడర్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని ఆయన కేసు వేశాడు. ఈ పౌడర్‌ను ఎక్కువ కాలం వాడడం వల్ల ఛాతీ దగ్గర మెసోథెలియోమా అనే క్యాన్సర్ వచ్చిందని కోర్టుకు తెలిపాడు. ఇక తర్వాత కంపెనీ కోర్టు ముందు వాదించింది. జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఉత్పత్తి పూర్తిగా సురక్షితం. ఈ టాల్కమ్ పౌడర్ ప్రత్యేక తెలుపు రంగు గాలి చొరబడని కంటైనర్‌లో ప్యాక్‌ చేసి ఉంటుందని కంపెనీ కోర్టుకు వివరించింది. ఉత్పత్తి సురక్షితమైనదని, ఉపయోగం కోసం తగినదని కంపెనీ పేర్కొంది. ఈ కేసులో లీగల్ ఫీజులు, ఇతర ఖర్చులను నివారించడానికి కంపెనీ ఒక పరిష్కారాన్ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా జరిమానా..

జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాలు ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీని ఆదేశించాయి. కొన్ని నమూనాలు మానవ శరీరానికి హానికరమని ఆరోపించారు. అప్పట్లో అమ్మకాలు పడిపోతున్నాయంటూ ఆ కంపెనీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి తొలగించింది.

రెండేళ్లుగా పోరాటం

ఆంథోనీ హెర్నాండెజ్ వాలాడెజ్ గత రెండేళ్లుగా కంపెనీతో పోరాడుతున్నారు. దానికి అనేక రుజువులను కూడా సమర్పించాడు. విచారణ ముగిశాక కోర్టు కంపెనీకి రూ.154 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితుడు, పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!