Gold Price Today: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తులం బంగారం రేటు ఎంత ఉందంటే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. శుభకార్యాలున్నా.. ఏదైనా పండుగలున్నా.. చాలా మంది బంగారం విక్రయిస్తుంటారు. అందుకే బంగారం, వెండికి చాలా డిమాండ్ ఉంటుంది.

Gold Price Today: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తులం బంగారం రేటు ఎంత ఉందంటే..
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2023 | 6:36 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. శుభకార్యాలున్నా.. ఏదైనా పండుగలున్నా.. చాలా మంది బంగారం విక్రయిస్తుంటారు. అందుకే బంగారం, వెండికి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే, ప్రపంచంలో, దేశీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం ధర రూ.550 మేర పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 60,650 ఉంది. కిలో వెండి ధర రూ.400 మేర పెరిగి రూ.78400 కు చేరింది.

బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర 60,800 ఉంది. ముంబైలో 22 క్యారెట్లు 55,600, 24 క్యారెట్లు 60,650, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,900, 24క్యారెట్లు 60,980, బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,600, 24క్యారెట్లు రూ.60,650గా ఉంది. తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22క్యారెట్ల పది గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల ధర 60,650 గా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400 గా ఉంది. ముంబైలో రూ.78,400, చెన్నైలో రూ.82,000, బెంగళూరులో రూ.77,850, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.82,000 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

గమనిక.. ఈ ధరలు గురువారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..