Mahila Samman Savings Certificate: ఈ నాలుగు బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం చిన్న పొదుపు పథకాలు వంటి వివిధ రకాల పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌లో ఆర్థికంగా ప్రోత్సహించడం, బాలికలతో సహా మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా..
కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం చిన్న పొదుపు పథకాలు వంటి వివిధ రకాల పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌లో ఆర్థికంగా ప్రోత్సహించడం, బాలికలతో సహా మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ కూడా బ్యాంకుల్లో కూడా ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ చిన్న పొదుపు పథకాలు ఇంతకు ముందు పోస్టాఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ 27 జూన్ 2023న ప్రచురించబడిన ఇ-గెజిట్ ప్రకటన ద్వారా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ 2023ని స్వీకరించడానికి, అమలు చేయడానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులకు అధికారం ఇచ్చింది.
నాలుగు బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
1. బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశం అంతటా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్-2023 పథకాన్ని ప్రవేశపెట్టింది
2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం అంతటా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్-2023 పథకాన్ని ప్రవేశపెట్టింది.
3. కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ భారతదేశం అంతటా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ 2023 పథకాన్ని అమలు చేస్తోంది.
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అన్ని శాఖలలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రారంభించిన మొదటి రుణదాత అని ఎండీ, సీఈవో రజనీష్ కర్నాటక్ తెలిపారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, వడ్డీ రేటు:
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్‌ఎస్‌సీ) పథకం మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం. ఎంఎస్‌ఎస్‌సీ అనేది 2 సంవత్సరాల డిపాజిట్ పథకం. ఇది సంవత్సరానికి 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది.
ఈ స్కీమ్‌కు అర్హత: మహిళలందరూ ఒక ఖాతాను తెరవడానికి అర్హులు. దీనిని తన కోసం లేదా మైనర్ బాలిక తరపున సంరక్షకుడు అకౌంట్ తెరవచ్చు.
డిపాజిట్ మొత్తం: ఈ పథకం కింద ఒకే ఖాతాదారు రూ.200,000 డిపాజిట్ చేయవచ్చు. ఒకేసారి లేదా దశలవారీగా కనీసం రూ.1,000 డిపాజిట్‌తో చేయవచ్చు. వ్యక్తులు ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. కానీ ఇప్పటికే ఉన్న ఖాతా, మరొక ఖాతా తెరవడం మధ్య కనీసం మూడు నెలల సమయం గ్యాప్ నిర్వహించాలి.
ఉపసంహరణ నియమాలు: ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40% వరకు ఖాతాదారు లేదా లీగల్ గార్డియన్ (మైనర్ విషయంలో) పాక్షిక ఉపసంహరణను ప్రారంభించవచ్చు.
పన్ను నియమాలు: వడ్డీని త్రైమాసికానికి కలిపి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో జమ చేస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కింద ఉన్న అన్ని ఆదాయాలపై ఇప్పటికే ఉన్న ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను విధించబడుతుంది. అయితే పథకం కింద టీడీఎస్ తీసివేయబడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి