AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections: మోడీ తుపాన్‌లో ప్రత్యర్థుల డమాల్‌.. గుజరాత్‌ ఎన్నికల్లో భారీగా పెరిగిన కమలం గ్రాఫ్‌

ఒకట్రెండు కాదు ఏకంగా ఏడుసార్లు విజయం.. అయినా ఫ్లవర్ ఫ్లేవర్‌ ఏమాత్రం తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి బంపర్‌ మెజార్టీ సాధించింది బీజేపీ. 27ఏళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ప్రధాని మోడీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు.

Gujarat Elections: మోడీ తుపాన్‌లో ప్రత్యర్థుల డమాల్‌.. గుజరాత్‌ ఎన్నికల్లో భారీగా పెరిగిన కమలం గ్రాఫ్‌
Pm Modi
Basha Shek
|

Updated on: Dec 08, 2022 | 9:55 PM

Share

కాంగ్రెస్‌పై సానుభూతి ఉంది.. ఆప్‌ ఎంటర్‌ అయింది.. ఇక కమలం ఖేల్ ఖతమే అన్న ఊహాగానాలు గుజరాత్‌లో ఊపందుకున్నాయి. కానీ కౌంటింగ్‌ మొదలయ్యాక అవన్నీ సరయూ నదిలో కొట్టుకుపోయాయి. కమల వికాసం అంతకుమించి అనేలా వికసించింది. 156 స్థానాల్లో విజయదుందుభి మోగించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో నిలిచింది బీజేపీ. ఒకట్రెండు కాదు ఏకంగా ఏడుసార్లు విజయం.. అయినా ఫ్లవర్ ఫ్లేవర్‌ ఏమాత్రం తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి బంపర్‌ మెజార్టీ సాధించింది బీజేపీ. 27ఏళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ప్రధాని మోడీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా ఏమీ చేయలేకపోయాయి. ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు కమలం గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ఓ వైపు ట్రయాంగిల్‌ ఫైట్‌.. ఇంకోవైపు కులాల కుంపట్లు.. మరోవైపు ప్రాంతాల వారీగా పాలిటిక్స్ నడిపినా ఓటర్లు గుజరాత్ వికాస్ నినాదానికే పట్టంకట్టారు. అభివృద్ధికి, అవినీతికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను ప్రకటించిన మోడీ తన ప్రచారంతో విశేషంగా ఆకట్టుకున్నారు. మోడీ, అమిత్‌షా ద్వయం వ్యూహాలు, గుజరాత్‌ అభివృద్ధి లాంటి ప్రచారాస్త్రాలు కమలం విజయంలో కీ రోల్ పోషించాయి. ఆప్‌, ఎంఐఎంలు కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చడం బీజేపీకి మరింత కలిసొచ్చింది.

156 స్థానాలతో ప్రభంజనం..

  • బీజేపీ-156
  • కాంగ్రెస్‌-17,
  • ఆప్‌-5,
  • స్వతంత్రులు-4

సీఎంగా భూపేంద్ర పటేల్‌..

కాగా గుజరాత్‌లో 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. నాడు 121 సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి వరుస విజయాలతో అధికారంలో కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా జరిగిన ఎన్నికల్లో తన సొంత రికార్డ్‌ను బద్దలుకొట్టి బీజేపీ చరిత్ర తిరగరాసింది. ఏకంగా 156 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5, స్వతంత్రులు నాలుగు స్థానాలకు పరిమితం అయ్యారు. ఇక 13స్థానాల్లో బరిలోకి దిగిన ఎంఐఎం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం 0.19శాతం ఓటింగ్‌కే పరిమితం అయింది. ఈ ఘోర పరాభవంతో ఆ పార్టీ నేతల నుంచి స్పందనే లేకుండా పోయింది. బీజేపీ గ్రాండ్ విక్టరీతో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు భూపేంద్ర పటేల్‌. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..