GST Relief: రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేంద్రం.. జీఎస్టీ బకాయిలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం

పలు రాష్ట్రాలకు మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. జీఎస్టీ (GST) నష్టాలు పేరుకుపోతున్నాయని గగ్గోలు పెడుతున్న రాష్ట్రాలకు ఈ ఊరట ఉపయోగకరంగా మారనున్నది. ఈ మేరకు..

GST Relief: రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేంద్రం.. జీఎస్టీ బకాయిలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Gst Refund
Follow us

|

Updated on: Mar 15, 2021 | 6:49 PM

GST relief for many states by Modi government: పలు రాష్ట్రాలకు మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. జీఎస్టీ (GST) నష్టాలు పేరుకుపోతున్నాయని గగ్గోలు పెడుతున్న రాష్ట్రాలకు ఈ ఊరట ఉపయోగకరంగా మారనున్నది. ఈ మేరకు సోమవారం (మార్చి 15న) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను కేంద్రమే వంద శాతం (పూర్తిగా) భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన సోమవారం వెలువడింది.

స్పెషల్ బారోయింగ్ ప్లాన్ (Special Borrowing Plan)లో భాగంగా రాష్ట్రాలకు మొత్తం1 లక్షా 10 వేల కోట్ల రూపాయల పరిహారం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ (Financial Ministry) వెల్లడించింది. అంచనా వేసిన జీఎస్టీ నష్ట పరిహారంలో వంద శాతం (పూర్తిగా) విడుదల చేసినట్లు తెలిపింది. తాజాగా 20వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి 4,104 వేల కోట్ల రూపాయలను విడుద‌ల చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ‌ (Telangana State) రాష్ట్రానికి 2380 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కి 2311 కోట్ల రూపాయల పరిహారం విడుద‌ల చేసింది మోదీ ప్రభుత్వం.

కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. అటు కేంద్ర ప్రభుత్వ ఆదాయం కూడా దెబ్బతిన్నది. ఈ క్రమంలో తమను కేంద్రమే ఆదుకోవాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే, కేంద్రానికి కూడా ఆదాయం లేకపోవడంతో దీనికి కొంత సమయం పట్టింది. తాజాగా నిధులను సమకూర్చుకున్న కేంద్రం రాష్ట్రాలను ఆదుకునేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగా స్పెషల్ బారోయింగ్ ప్లాన్ విధానాన్ని అనుసరించి పలు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా వున్నాయి.

ALSO READ: ఉచిత హామీలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు.. ఒకరికి మించి మరొకరి మ్యానిఫెస్టోలు

ALSO READ: భారత దేశం మెరిసిపోతోంది.. ఏకంగా రష్యానే వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి ఇండియా!

ALSO READ: మార్చి 18న తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌.. ప్రత్యేక రాష్ట్రమొచ్చాక బడ్జెట్ కేటాయింపుల లెక్కలివే..!

ALSO READ: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ALSO READ: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ