YCP Upperhand: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రబల శక్తిగా మారింది.

YCP Upperhand: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల
All Partys In Ap
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 15, 2021 | 2:27 PM

YCP upper hand in Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రబల శక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించింది వైసీపీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు రాగా… తాజా మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి 52.63 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 2.68 శాతం ఓటింగ్ పెరిగింది. అదే సమయంలో టీడీపీ గణనీయంగా తన ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 39.17 శాతం ఓట్లు రాగా మునిసిపల్ ఎన్నికల్లో 30.73 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే టీడీపీకి 8.44 శాతం ఓటింగ్ తగ్గింది.

బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోగా.. జనసేనకు ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు రాగా… మునిసిపాలిటీల్లో 2.41 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1.57 శాతం మేర బీజేపీ పుంజుకుంది. ఇక జనసేనకు అసెంబ్లీలో 5.53 శాతం ఓటింగ్ రాగా.. మునిసిపల్ ఎన్నికల్లో 4.67 శాతం ఓటింగ్ వచ్చింది. మొత్తంగా జనసేన 0.86 ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది. ఓట్ల శాతాన్ని మరింతగా తగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంది. సిపిఎం, సిపిఐలు మునిసిపోల్ ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతాన్నికొంత మేర పెంచుకున్నాయి. ఇక బిఎస్పీ ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గగా.. ఇండిపెండెంట్ల ఓటింగ్ శాతం కూడా కొద్దిగా తగ్గింది. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ కంటే నోటాకు ఓట్లు ఎక్కువ రావడం విశేషమనే చెప్పాలి. ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ను ఒక్కసారి పరిశీలిద్దాం…

2019 అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. వైసీపీ 175 సీట్లలో పోటీ చేసింది. 151 సీట్లలో గెలుచుకుంది. మొత్తం కోటి 56 లక్షల 88 వేల 569 ఓట్లు వైసీపీ అభ్యర్థులకు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో 49.95 శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఇక టీడీపీ కూడా 175 సీట్లలో పోటీ చేసింది. కేవలం 23 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కోటి 23 లక్షల 4 వేల 668 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 39.17 శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు పొందారు. అయితే.. అధికార పార్టీగా 2019 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ ఒక స్థానంలో డిపాజిట్ కోల్పోయింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 173 సీట్లలో పోటీ చేసింది. ఒక్క స్థానంలోను గెలుపొందలేదు. విశేషమేమంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ అభ్యర్థులకు మొత్తం రెండు లక్షల 64 వేల 437 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో 0.84 శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థులకు పడ్డాయి. ఇక జనసేన 137 సీట్లలో పోటీ చేసింది. పార్టీ అధ్యక్షుని హోదాలో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. అయితే ఆయన రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. జనసేన తరపున రాపాక వరప్రసాద్ ఒక్కరే రాజోలు నుంచి గెలుపొందారు. జనసేన తరపున పోటీ చేసిన వారిలో 121 మంది డిపాజిట్లు కోల్పోయారు. మొత్తమ్మీద జనసేన అభ్యర్థులకు 17 లక్షల 36 వేల 811 ఓట్లు పడ్డాయి. కాగా ఇది మొత్తం పోలైన ఓట్లలో 5.53 శాతం మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీ 174 సీట్లలో పోటీకి దిగింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. మొత్తం 174 సీట్లలోను డిపాజిట్లు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 3 లక్షల 68 వేల 909 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 1.17 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పొందారు.

2019

 

సిపిఐ పార్టీ 7 సీట్లలో పోటీ చేసింది. ఒక్క చోట కూడా గెలుపొందలేదు. మొత్తం ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది సీపీఐ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులందరికీ కలిపి 34 వేల 746 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో 0.11 శాతం ఓట్లను సీపీఐ అభ్యర్థులు పొందారు. సిపిఎం పార్టీ కూడా ఏడు స్థానాలలో పోటీ చేసింది. అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు సీపీఎం అభ్యర్థులు. ఒక లక్షా ఒక వేల 71 ఓట్లను సీపీఎం అభ్యర్థులు సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.32 శాతం. ఇక బీఎస్పీ కూడా ఏపీలో 21 సీట్లలో పోటీకి దిగింది. ఒక్క చోట కూడా గెలుపొందలేదు సరికదా.. మొత్తం 21 సీట్లలోను బీఎస్పీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థులందరికీ కలిపి 88 వేల 264 ఓట్లు పడ్డాయి. కాగా ఇది మొత్తం పోలైన ఓట్లలో 0.28 శాతం. ఇండిపెండెంట్లు మొత్తం 755 సీట్లలో పోటీ చేశారు. ఒక్క చోట కూడా ఏ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించలేదు. 754 సీట్లలో ఇండిపెండెంట్లు తమ డిపాజిట్లను కోల్పోయారు. ఇండిపెండెంట్లందరికీ కలిపి రెండు లక్షల 86 వేల 859 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 5.87 శాతం.

2021 మునిసిపల్, నగర పంచాయితీ, కార్పోరేషన్ ఎన్నికల ఓట్లను, శాతాలను పరిశీలిస్తే.. ఎన్నికలు జరిగిన మొత్తం 12 నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో మొత్తం 75 లక్షల 94 వేల 464 ఓట్లున్నాయి. వీటిలో మునిసిపాలిటీల్లో 30 లక్షల 13 వేల 702 ఓట్లు, మునిసిపల్ కార్పొరేషన్లలో 45 లక్షల 80 వేల 762 ఓట్లు వున్నాయి. కాగా.. 48 లక్షల 42 వేల 468 ఓట్లు పోలయ్యాయి. మునిసిపాలిటీల్లో 21 లక్షల ఆరు వేల రెండొందల ఓట్లు, మునిసిపల్ కార్పొరేషన్లలో 27 లక్షల 36 వేల 268 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 96 వేల 273 ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. మునిసిపాలిటీల్లో 38 వేల 426 ఓట్లు, కార్పొరేషన్లలో 57 వేల 847 ఓట్లను చెల్లనివిగా పరిగణించారు. మొత్తం చెల్లుబాటైన ఓట్లు 47 లక్షల 46 వేల 195 కాగా.. మునిసిపాలిటీల్లో 20 లక్షల 67 వేల 774 ఓట్లు, కార్పొరేషన్లలో 26 లక్షల 78 వేల 421 ఓట్లను చెల్లుబాటైన ఓట్లుగా పరిగణించి వాటి లెక్కింపు చేపట్టారు.

ఇక అధికార వైసీపీకి మునిసిపాలిటీల్లో 11 లక్షల 78 వేల 275 ఓట్లు, కార్పొరేషన్లలో 13 లక్షల 19 వేల 466 ఓట్లు పడ్డాయి. మొత్తం 24 లక్షల 97 వేల 741 ఓట్లు తాజా మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దక్కించుకుంది. కాగా ఇవి మొత్తం పోలైన ఓట్లలో 52.63 శాతం. అంటే మొత్తం పోలైన ఓట్లలో అధికార పార్టీకి 52.63 శాతం ఓట్లు పొందిందన్నమాట. ఇది 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే 2.68 శాతం అధికం. వైసీపీ అభ్యర్థులు రెండు వేల 265 మంది గెలుపొందారు. టీడీపీకి మొత్తమ్మీద 14 లక్షల 58 వేల 346 ఓట్లను సాధించింది. మునిసిపాలిటీల్లో 6 లక్షల 22 వేల 812 ఓట్లు, కార్పోరేషన్లలో 8 లక్షల 35 వేల 534 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థులకు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం పార్టీ 30.73 శాతం ఓట్లను సాధించి, 349 అభ్యర్థులను గెలిపించుకుంది.

2021 Min (1)

2021 Min (1)

ఇక బీజేపీకి తాజా మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం లక్షా 14 వేల 365 ఓట్లు పడ్డాయి. మునిసిపాలిటీల్లో 40 వేల 230 ఓట్లు, కార్పొరేషన్లలో 74 వేల 135 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు పడ్డాయి. ఇది మొత్తం ఓట్లలో 2.41 శాతం. మొత్తం గెలిచిన సీట్లు తొమ్మిది. ఇక బీజేపీతో కలిసి మునిసిపల్ ఎన్నికలను ఎదుర్కొన్న జనసేన పార్టీ రెండు లక్షల 21 వేల 705 ఓట్లు సాధించుకుంది. మునిసిపాలిటీల్లో 45 వేల 438 ఓట్లు, కార్పొరేషన్లలో లక్షా 76 వేల 267 ఓట్లను జనసేన పొందింది. మొత్తం పోలైన ఓట్లలో 4.67 శాతం ఓట్లను జనసేన అభ్యర్థులు సాధించారు. మొత్తమ్మీద 25 సీట్లలో జనసేన క్యాండిడేట్లు గెలుపొందారు. ఇక సీపీఐకి తాజా మునిసిపల్ ఎన్నికల్లో 38 వేల 107 ఓట్లు వచ్చాయి. వీటిలో పది వేల 623 ఓట్లు మునిసిపాలిటీల్లోను, 27 వేల 484 ఓట్లు కార్పొరేషన్లలోను సీపీఐ అభ్యర్థులకు పడ్డాయి. సీపీఐ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నది. అయినా కూడా ఆ పార్టీకి పెద్దగా ఓట్లు పడలేదు. మొత్తమ్మీద సీపీఐ పార్టీ అభ్యర్థులకు 0.80 ఓట్లు రాగా.. నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.

సీపీఎం పార్టీ సొంతంగా ఎన్నికలను ఎదుర్కొని మొత్తం 38 వేల 498 ఓట్లను సాధించింది. వీటిలో 9 వేల 105 ఓట్లు మునిసిపాలిటీల్లో రాగా.. కార్పొరేషన్లలో 29 వేల 393 ఓట్లు వచ్చాయి. 0.81 శాతం ఓట్లతో ఇద్దరు అభ్యర్థులను సీపీఎం గెలుచుకోగలిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఫేట్ ఏ మాత్రం మారలేదు. రాష్ట్ర విభజన నాటి ప్రజాగ్రహాన్ని ఇంకా పొందుతూనే వుంది. తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 29 వేల 557 ఓట్లు రాగా.. వీటిలో మునిసిపాలిటీల్లో 5 వేల 57 ఓట్లు, కార్పొరేషన్లలో 24 వేల 500 ఓట్లను కాంగ్రెస్ పార్టీ పొందగలిగింది. మొత్తం ఓట్లలో 0.62 శాతం పొందిన కాంగ్రెస్ పార్టీ ఒక చోట విజయాన్ని నమోదు చేసింది. మరో జాతీయ పార్టీ బిఎస్పీకి మునిసిపాలిటీల్లో వేయి 217 ఓట్లు, కార్పొరేషన్లలో 3 వేల 253 ఓట్లు ఓట్లు రాగా… మొత్తం నాలుగు వేల 470 ఓట్లను పొందింది. 0.09 ఓట్ల శాతంలో ఒక్కరినీ గెలిపించుకోలేకపోయింది బీఎస్పీ.

ఇతర పార్టీల తరపున పోటీచేసిన అభ్యర్థులందరికీ కలిపి మొత్తం ఇరవై వేల 830 ఓట్లు రాగా.. వీటిలో మునిసిపాలిటీల్లో 12 వేల 845 ఓట్లు, కార్పొరేషన్లలో 7 వే ల985 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో 0.44 శాతం ఓట్లను ఇతర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులందరూ కలిసి పొందారు. ఇతరులు ఒక చోట గెలుపొందారు కూడా. ఇక ఇండిపెండెంట్లందరూ కలిపి రెండు లక్షల 71 వేల 981 ఓట్లు పొందారు. మునిసిపాలిటీల్లో లక్షా 20 వేల 843 ఓట్లు, మునిసిపల్ కార్పొరేషన్లలో లక్షా 51 వేల 138 ఓట్లను ఇండిపెండెంట్ అభ్యర్థులు పొందారు. మొత్తం ఓట్ల శాతంలో ఇది 5.73 శాతం. కాగా.. ఇండిపెండెంట్లు గెలిచిన సీట్లు -86. ఆశ్చర్యకరంగా నోటాకు 50 వేల పైచిలుకు ఓట్లు పడడం విశేషం. అంటే అభ్యర్థులెవరికీ తాము ఓటు వేయడం లేదంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేసిన ఓటర్ల సంఖ్య 50 వేల 595 కాగా ఇది మొత్తం పోలైన ఓట్లలో 1.07 శాతం. మునిసిపాలిటీల్లో 21 వేల 329, మునిసిపల్ కార్పొరేషన్లలో 29 వేల 266 ఓట్లు నోటాకు పడ్డాయి.