AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Poster No Banner : ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా రాజకీయ ర్యాలీలు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం.. ఎందుకంటే..!

ఎన్నికలు, పంక్షన్ల, పండుగలు ఇలా ఏమైనా సరే పోస్టర్లు, బ్యానర్లు , కటౌట్లు రెడీ చేస్తారు.. అయితే ఈ గ్రామంలో మాత్రం రాజకీయ నాయకుల నినాదాలు, రంగురంగుల ఉత్సవాలు, ర్యాలీలు నిషేధం...

No Poster No Banner : ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా రాజకీయ ర్యాలీలు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం.. ఎందుకంటే..!
Thirumangalam Village In Ta
Surya Kala
|

Updated on: Mar 15, 2021 | 6:53 PM

Share

No Poster No Banner :  ఎన్నికలు, పంక్షన్ల, పండుగలు ఇలా ఏమైనా సరే పోస్టర్లు, బ్యానర్లు , కటౌట్లు రెడీ చేస్తారు.. అయితే ఈ గ్రామంలో మాత్రం రాజకీయ నాయకుల నినాదాలు, రంగురంగుల ఉత్సవాలు, ర్యాలీలు నిషేధం. ఎటువంటి రణగొణ ధ్వనుల కార్యకలాపాలు అనుమతించరు. పోస్టర్‌, బ్యానర్లకు ప్రసిద్ధి గాంచింది మదురై జిల్లా. అటువంటి జిల్లాలో బ్యానర్‌ కనిపించని గ్రామముందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

మదురై శివార్లలో కరుప్పాపూరణి సమీపంలోని ఒత్తవీడు అనే గ్రామం. ఈ గ్రామం మధురై తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. చిన్న గ్రామమైన ఒత్తవీడులో ఒక్కటంటే ఒక్కటి వాల్‌పోస్టర్‌ ఉండదు. ఇది గ్రామ కట్టుబాట్లలో ఒకటి. వందేళ్ల నుండి ఇటువంటి ఆనవాయితీలను కొనసాగిస్తూనే ఉన్నారు అక్కడి ప్రజలు. వందేళ్ల క్రితం అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి జిల్లాలోని టి కల్లుపట్టి, పెరుంగుడి సుమారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చారు. ఇక్కడ తిరుమంగళంకు చెందిన మూడు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ నివాసితుల పేరుకు గుర్తుగా ఈ గ్రామానికి ఒత్తవీడు అని పేరు వచ్చింది.

ప్రస్తుతం ఈ గ్రామంలో 300 కుటుంబాలు వుండగా..650 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో అనేక పాత గుర్తులు, పాత భవనాలు చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. అటువంటి ఈ గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి ఎటువటి పోస్టర్లు లేదా బ్యానర్లు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. గ్రామ కట్టుబాట్లకు తగ్గట్టుగా అక్కడి ప్రజలు నడుచుకుంటూ… హీరోలకు, పంక్షన్లు, ఇతర కార్యక్రమాలకైనా ఎటువంటి పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేయరు. ఇంకో విశేషమేమిటంటే గ్రామంలో గోడలపై పోస్టర్లు అంటించాదని, బ్యానర్లు, కటౌట్లు కట్టరాదని గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన బోర్డులో రాసి ఉంటుంది. మదురై కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో పాత బస్టాండు, దివంగత కామరాజ్‌ నాడార్‌ జీవించి వుండగా ప్రారంభించిన మానసికోల్లాస కేంద్రం వంటి పాత భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఎటువంటి తగాదాలు ఏర్పడినా పోలీసు స్టేషన్ ను ఆశ్రయించరు. ఎందుకంటే గ్రామ పెద్దలు మాంధై (బహిరంగ ప్రదేశం) వద్ద ఇరు వర్గాలతో పాటు సాధారణ గ్రామస్తుల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తారు. అయితే, ఇప్పుడు అది మారిందని గ్రామస్తులు అంటున్నారు.

Also Read:

వయసుతో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టె ఆప్రికాట్.. ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదులుగా..!

తండ్రి బాటలో నడుస్తున్న మంచువారబ్బాయి .. మెగా హీరోకు విలన్ గా ఎంట్రీ ..?