AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Hero Turns Villain : తండ్రి బాటలో నడుస్తున్న మంచువారబ్బాయి .. మెగా హీరోకు విలన్ గా ఎంట్రీ ..?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీలు మళ్ళీ మొదలు పెట్టింది సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత చిన్న పెద్ద హీరోలు మల్టీస్టారర్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో మెగా మల్టీస్టారర్...

Manchu Hero Turns Villain : తండ్రి బాటలో నడుస్తున్న మంచువారబ్బాయి .. మెగా హీరోకు విలన్ గా ఎంట్రీ ..?
Manchu Hero Turns Villain
Surya Kala
|

Updated on: Mar 15, 2021 | 6:15 PM

Share

Manchu Hero Turns Villain  : టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీలు మళ్ళీ మొదలు పెట్టింది సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత చిన్న పెద్ద హీరోలు మల్టీస్టారర్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో మెగా మల్టీస్టారర్ మూవీ గా నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలతో జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతుంది. ఇక మరో క్రేజీ కాంబోకు టాలీవుడ్ వేదిక కాబోతున్నదని తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా లో మంచు వారబ్బాయి నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. బన్నీ, సుక్కు కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీలో ఓ క్యారెక్టర్‌ కోసం మంచు మనోజ్‌ను తీసుకుందామని బన్నీ, సుకుమార్లు అనుకుంటున్నారట. విజయ్‌ సేతుపతి డేట్లు కారణంగా చేయనని తప్పుకున్న క్యారెక్టర్లో… మనోజ్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఇప్పుడు వీరిద్దరు ఉన్నారట. ఇదే విషయంపై ఇప్పటికే మనోజ్ ను సంప్రదించునట్లు ఫిల్మ్ నగర్ లో ఓ టాక్. ఇదే నిజమైతే వేదం తరువాత ఈ హీరోలు మళ్లీ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడం ఖాయని తెలుస్తోంది. ‘వేదం’… సినిమాతో మనల్ని మెస్మరైజ్‌ చేసిన అల్లు అర్జున్‌, మంచు మనోజులు మళ్లీ మరో సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటసన చేయాల్సి ఉంది.

అయితే మోహన్ బాబు కూడా గతంలో హీరోగా నటిస్తూనే.. చాలా సినిమాల్లో విలన్ గా తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇప్పుడు తనయుడు మనోజ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

వయసుతో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టె ఆప్రికాట్.. ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదులుగా..!

‘మీరు త్వరగా కోలుకోవాలి, కానీ, బెంగాల్ సీఎం మమత ‘గాయం’పై హోం మంత్రి అమిత్ షా

కోయంబత్తూర్ సౌత్​అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్