Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ ఫస్ట్ సాంగ్

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం".దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ

Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ ఫస్ట్ సాంగ్
Anand Deverakonda Pushpaka
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2021 | 5:41 PM

Pushpaka Vimanam Song : యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”.దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ‘‘పుష్పక విమానం’’ మూవీ నుండి మొదటి సాంగ్ ‘‘సిలకా’’ ను సోమవారం (మార్చి 15) ఉదయం నిమిషాలకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

‘‘సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా…సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘ అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రంతో కలిసి సాహిత్యాన్ని అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పాటలో కనిపిస్తున్నారు. పాటను ఆ ఇద్దరు పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు జోష్ తీసుకొచ్చారు. ఇక ఈ  సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ‘‘పుష్పక విమానం’’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : Ram Pothineni and Genelia : రామ్ ను ఆటపట్టించిన జెనీలియా.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన

‘డోంట్ రష్’లో భాగంగా అదరగొడుతున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న సమంత, లావణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియోలు

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..