AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి కానుక.. జీఎస్టీ ధమాకాతో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. నిర్మలా సీతారామన్‌ ఏమన్నారంటే..

GST సంస్కరణలు దేశ భవిష్యత్తును మార్చబోతున్నాయా? వినియోగదారుల్లో కొనుగోలు శక్తి ఎంత శాతంపెరిగింది?. సంస్కరణల ద్వారా వచ్చిన మార్పులేంటీ?.. అనే దానిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణతో దేశంలో విపరీతంగా కొనుగోళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు.

దీపావళి కానుక.. జీఎస్టీ ధమాకాతో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. నిర్మలా సీతారామన్‌ ఏమన్నారంటే..
Piyush Goyal, Nirmala Sitharaman And Ashwini Vaishnaw
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2025 | 8:37 AM

Share

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణతో దేశంలో విపరీతంగా కొనుగోళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. జీఎస్టీ 2.0తో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామన్నారు నిర్మలా. ఢిల్లీలో ధనత్రయోదశి (ధంతేరస్) సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 22న తీసుకువచ్చిన సంస్కరణల వల్ల పండుగ సీజన్‌లలో వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. దీంతో దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపారని చెప్పారు.

జీఎస్టీ 2.0తో దేశమంతా పండగ వాతావరణం నెలకొందన్నారు. ఇది దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. జీఎస్టీ డబుల్‌ ధమాకాతో దేశప్రజల ఇంటికి లక్ష్మీదేవిని ప్రధాని మోదీ తీసుకువచ్చారన్నారు. జీఎస్టీ సంస్కరణ సమయంలో దేశంలో వినియోగం, డిమాండ్ ఎలా పెరుగుతుందనే దానిపై అంచనాలు రూపొందించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఉత్సాహాన్ని తీసుకురావడంతో దేశంలోని అన్ని రంగాలు లాభపడుతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది దాదాపు రూ.20 లక్షల కోట్ల అదనపు వినియోగం జరిగే అవకాశం ఉందని అన్నారు. పాలు, సిమెంట్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు ధరలలో పన్ను తగ్గింపు ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. వినియోగం గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది భారతదేశం అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతుల పరంగా చైనాను అధిగమించిందని వెల్లడించారు.

మరినని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..