AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. దీపావళి ముందు తులం బంగారం, వెండి ధర ఎంతుందో తెలుసా..?

దీపావళి ముందు దంతేరస్ రోజున బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి.. ఈ వేడుకలు దాదాపు 5 రోజుల పాటు సాగుతాయి. అయితే.. ఈ ధన్‌తేరాస్ వేళ.. బంగారం, వెండి వంటి లోహాల్ని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఆకాశన్నంటుతున్న బంగారం, వెండి రేట్లు తగ్గి కాస్త ఊరటనిచ్చాయి..

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. దీపావళి ముందు తులం బంగారం, వెండి ధర ఎంతుందో తెలుసా..?
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2025 | 6:30 AM

Share

దీపావళి ముందు దంతేరస్ రోజున బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి.. ఈ వేడుకలు దాదాపు 5 రోజుల పాటు సాగుతాయి. అయితే.. ఈ ధన్‌తేరాస్ వేళ.. బంగారం, వెండి వంటి లోహాల్ని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఆకాశన్నంటుతున్న బంగారం, వెండి రేట్లు తగ్గి కాస్త ఊరటనిచ్చాయి.. శనివారం బంగారంపై దాదాపు రూ.3వేల వరకు ధర తగ్గింది.. వెండిపై కూడా రూ.13వేల వరకు తగ్గింది. ఇదే ట్రెండ్ సాయంత్రం వరకు కొనసాగింది. అయితే.. ఆదివారం ఉదయం (అక్టోబర్ 19) ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,30,860 గా ఉంది.
  • 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములు రూ.1,19,950 గా ఉంది.
  • వెండి కిలో రూ.1,72,000 లుగా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,30,860 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,19,950 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,90,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,30,860, 22 క్యారెట్ల ధర రూ.1,19,950 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,90,000లుగా ఉంది..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,31,010, 22 క్యారెట్లు రూ.1,20,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,72,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,860, 22 క్యారెట్లు రూ.1,19,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,72,000లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,30,370, 22 క్యారెట్ల ధర రూ.1,19,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,90,000లుగా ఉంది.

కాగా.. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us