Marriage: పెళ్లిలో పరిమితికి మించి డీజే సౌండ్.. వద్దని వారించిన వరుడు, చివరికి ఏమైందంటే..
ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ సంబంధిత మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అప్పటి వరకు ఉల్లాసంగా వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ఎక్కడపడితే అక్కడ కెమెరాలు ఉండడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి..

ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ సంబంధిత మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అప్పటి వరకు ఉల్లాసంగా వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ఎక్కడపడితే అక్కడ కెమెరాలు ఉండడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి సంఘటనలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ముఖ్యంగా యువత హృద్రోగం కారణంగా మరణిస్తుండడం అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని సితమర్హి జిల్లాలో సురేంద్ర అనే యువకుడి వివాహం బుధవారం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహం జరుగుతున్న సమయంలో జయమాల తంతు పూర్తి కాగానే వరుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు వరుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే సురేంద్ర మరణించినట్లు వైద్యులు గుర్తించారు.
ఇదిలా ఉంటే వివాహ వేడుకకు ఎంట్రీ ఇచ్చే సమయంలో పరిమితికి మించి డీజే సౌండ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఇబ్బందిగా అనిపించిన వరుడు.. సౌండ్‌ను తగ్గించమని కోరగా, సదరు వ్యక్తులు పట్టించుకోలేదని వరుడి తరపున బంధువులు చెబుతున్నారు. వరుడు మరణించడానికి విపరీతమైన సౌండే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




