AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Kishan Reddy: తెలంగాణకు మోదీ సర్కార్ మరో కానుక.. రూ.400 కోట్లతో విమానయాన పరిశోధనా కేంద్రం..

తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో భారీ బహుమతిని ఇచ్చిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని తొలి విమానయాన పరిశోధన కేంద్రంను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ పనులు బేగంపేటలో అత్యంత పురోగతితో ముందుకు సాగుతున్నాయన్నారు.

Minister Kishan Reddy: తెలంగాణకు మోదీ సర్కార్ మరో కానుక.. రూ.400 కోట్లతో విమానయాన పరిశోధనా కేంద్రం..
Union Minister Kishan Reddy
Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 03, 2023 | 5:05 PM

Share

తెలంగాణకు మోదీ సర్కారు మరో కానుక ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (కారో) ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భారతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నామన్నారు. శరవేగంగా పనులు సాగుతున్న క్రమంలో 2023 జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్‌ అని తెలిపారు. హైదరాబాద్‌లో 2018లో ఈ కారోకు శంకుస్థాపన జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైపౌర విమానయాన పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశారు. బేగంపేటలోని 27 ఎకరాల్లో పౌర విమానయాన పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్‌లు కూడా ఈ కేంద్రంలో ఉంటాయి.

దీనిని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 402.13 కోట్ల వ్యయంతో సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యురిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్ , ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్ లను ఈ కేంద్రం కలిగి ఉంటుంది.

విమానాశ్రయం పక్కనే ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో అధునాతనంగా నిర్మిస్తున్నారు. పరిశోధన, అభివృద్ధికి సంంధించిన పలు భవనాల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. రూ.402 కోట్ల అంచనాతో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మిస్తోంది. ఇక్కడ పరిశోధన సదుపాయాలతోపాటూ ఎయిర్‌పోర్ట్స్‌ ఎయిర్‌ నావిగేషన్‌ సేవలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్స్‌ డొమైన్‌ సిమ్యూలేటర్స్‌, నెట్‌వర్క్‌ ఎమ్యులేటర్‌, విజువలైజేషన్‌, అనాలసిస్‌ ల్యాబ్‌లు, సర్వెలెన్స్‌ ల్యాబ్స్‌, నావిగేషన్‌, సిమ్యులేషన్స్‌ ల్యాబ్‌లు రానున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీ, త్రెట్‌ అనాలసిస్‌ ల్యాబ్స్‌, డాటా మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్లు రానున్నాయి. ఇక్కడే ఏవియేషన్‌ విశ్వవిద్యాలయం రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం