AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఆ దురలవాటు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు

కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెగాసస్‌ని ఉపయోగించి తన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారి తనకు తెలియజేసినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఆ దురలవాటు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు
Anurag Thakur
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2023 | 4:15 PM

Share

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. అబద్ధాలు చెప్పి భారత్ పరువు తీయడం రాహుల్ గాంధీకి అలవాటే అన్నారు. నిన్నటి ఫలితాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. పెగాసస్ తన మొబైల్‌లో లేదని, తన గుండెలో మనసులో ఉందని రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఠాకూర్ మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారత్‌ గౌరవం పెరిగిందని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. ఇటలీ ప్రధాని చెప్పిన మాటలు తాను (రాహుల్ గాంధీ) విని ఉండకపోవచ్చని… ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీని ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు. పెగాసస్ కేసుపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తన ఫోన్ డిపాజిట్ చేయలేదని బలవంతం చేయలేదన్నారు. తన విదేశీ స్నేహితుల ద్వారా దేశం పరువు తీసేందుకు తరచూ ప్రయత్నిస్తుంటాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి ఫలితాలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. పెగాసస్ తన మొబైల్‌లో లేదని, తన గుండెలో, మనసులో ఉందని రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఠాకూర్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మీడియా పరువు తీసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అంతే కాదు, దేశంలోని రాజ్యాంగ సంస్థలను కించపరిచే అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. రాహుల్ గాంధీకి పదే పదే అబద్ధాలు చెప్పడం, దేశాన్ని అవమానించడం అలవాటు అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. విదేశీ మట్టిని, విదేశీ స్నేహితులను, విదేశీ ఏజెన్సీలను ఉపయోగించి భారత్‌పై దుష్ప్రచారం చేయడం వారికి అలవాటుగా మారిందని అన్నారు. ఈ అంశాలు కాంగ్రెస్ ఎజెండాను ప్రశ్నిస్తున్నాయి.

కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై నిరంతర ఒత్తిడి పెరుగుతుందన్నారు. పెగాసస్‌ని ఉపయోగించి తన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారి తనకు తెలియజేసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..