AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ వచ్చేసిందోచ్.. భారత్‌ చేరిన రెండు నౌకలు.. రాష్ట్రాలకు LPG తరలింపు షురూ!

భారత ప్రజలకు ఇదో గుడ్‌ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా భారత్‌లో నెలకొన్న గ్యాస్‌ కష్టాలు ఇక తీరనున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఆంక్షలతో హర్ముజ్ జలసందిలో చిక్కుకున్న భారత్‌కు చెందిన రెండో ఎల్‌పీజీ నౌక కూడా ఇవాళ భారత్‌కు చేరుకుంది. ఆ రెండు నౌకల రాకతో ఇప్పుడు భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.

గ్యాస్ వచ్చేసిందోచ్.. భారత్‌ చేరిన రెండు నౌకలు.. రాష్ట్రాలకు LPG తరలింపు షురూ!
Lpg Crisis India
Anand T
|

Updated on: Mar 17, 2026 | 3:39 PM

Share

దేశ ప్రజలకు భారత ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. జనాలు అందరూ ఇక ఊపిరి పీల్చుకోవచ్చని.. LPG పరేషాన్‌ త్వరలో తీరబోతోందని తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకున్న భారత్‌కు చెందిన రెండు సహజవాయువు నౌకలు భారత్‌కు చేరకున్నట్టు తెలిపింది. దీంతో దేశంలో గ్యాస్ కష్టాలు తీరనున్నాయని స్పష్టం చేసింది. హర్మూజ్ వద్ద చిక్కుకుపోయిన రెండు నౌకల్లో శివాలిక్ అనే నౌక 46,500 మెట్రిక్‌ టన్నుల LPGతో సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని ముంద్ర పోర్టుకు చేరుకోగా.. నందదేవి అనే రెండో నౌక ఇవాళ జామ్‌నగర్‌లోని వాడినార్‌ పోర్టుకు చేరుకుంది.

భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చొరవతో ఈ రెండు నౌకలు క్షేమంగా భారత్‌కు చేరుకున్నాయి. ఈ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటడానికి భారత, ఇరాన్ నౌకాదళాలు అవసరమైన సహాయాన్ని అందించాయని నందా దేవి చీఫ్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో మొత్తం 611 మంది నావికులతో 22 భారత జెండా నౌకలు మిగిలి ఉన్నాయని.. సుమారు 81,000 టన్నుల ముర్బన్ ముడి చమురుతో యూఏఈ నుంచి ‘జగ్ లాడ్కి’ అనే మరో నౌక కూడా సురక్షితంగా భారతదేశానికి తిరిగి వస్తోందని ఆయన తెలిపారు.

అయితే గుజరాత్‌లో రెండు పోర్టులకు చేరుకున్న ఈ రెండు నౌకల్లోని LPGను ఇతర నౌకల్లోకి బదిలీ చేసే ప్రక్రియను మొదలు పెట్టున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బదిలీ పూర్తయిన వెంటనే, రెండు నౌకలను తక్షణమే తమిళనాడుకు పంపనున్నట్టు తెలిపారు. ఇతర మార్గాల ద్వారా లేదా ఇతర ప్రాంతాల నుండి రవాణా చేసే కంటే, ఈ నౌకలను నేరుగా పంపడం వల్ల రవాణాలో ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us