AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Tourism: పర్యాటకులకు బిగ్ అలర్ట్.. గోవాలో ఇలా చేస్తే ఇకపై జైలుకే

గోవాలో పర్యాటక ప్రదేశాల్లో ఇబ్బందులు కలిగించే వారితోపాటు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి గోవా టూరిస్టు ప్లేసెస్‌ సవరణ బిల్లు 2025ను ఆమోదించింది. న్యూసెన్స్‌ చేసే వారికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది.

Goa Tourism: పర్యాటకులకు బిగ్ అలర్ట్.. గోవాలో ఇలా చేస్తే ఇకపై జైలుకే
Goa Tourism
Shaik Madar Saheb
|

Updated on: Aug 03, 2025 | 11:07 AM

Share

గోవాలో పర్యాటక ప్రదేశాల్లో ఇబ్బందులు కలిగించే వారితోపాటు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి గోవా టూరిస్టు ప్లేసెస్‌ సవరణ బిల్లు 2025ను ఆమోదించింది. న్యూసెన్స్‌ చేసే వారికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అనధికార బోట్లను లేదంటే కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమయ్యే తేలియాడే వస్తువులను ఆపరేట్‌ చేయడం నిషేధమని గోవా ప్రభుత్వం హెచ్చరించింది.. వస్తువులు కొనాలని పర్యాటకులను ఇబ్బంది పెట్టొద్దని.. అనధికారిక ప్రదేశాల్లో మద్యం సేవించవద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. గ్లాసులను పగలగొట్టి ఇతరులకు ఇబ్బంది కల్గించవద్దని… అలా చేస్తే కేసులు తప్పటివని హెచ్చరించింది.. జరిమానాతోపాటు.. శిక్షను కూడా విధిస్తామని పేర్కొంది.

అలాగే.. బహిరంగ ప్రదేశాల్లో వంట చేసుకోవడంపై నిషేధం విధించింది. ఎక్కడ పడితే చెత్త వేసి టూరిస్ట్‌ స్టేట్ ఐడెంటీని నాశనం చేయవద్దని పేర్కొంది. బీచ్‌లలో వాహనాలను ఆపరేట్‌ చేయవద్దని.. అనుమతి లేకుండా రాష్ట్రం వెలుపల ఉన్న ప్రదేశాలకు పర్యాటక సేవలు అందించడం వంటి వాటిని న్యూసెన్స్‌ నిర్వచనంలో చేర్చారు. చట్టవిరుద్ధమైన టికెట్ల ప్రచారం, వాటర్ స్పోర్ట్స్ లాంటి వాటిని కూడా నిషేధించారు.టూరిస్టుల స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించడాన్ని ఈ కొత్త చట్టంలో నేరంగా పరిగణించారు.

పర్యాటక ప్రమాణాలను పెంచే నిర్ణయాత్మక చర్యలో భాగంగా గోవా ప్రభుత్వం త్వరలో గోవా పర్యాటక ప్రదేశాల (రక్షణ – నిర్వహణ) చట్టం, 2001కి కీలక సవరణను ఆమోదించనుందని.. పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఎ ఖౌంటే తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. కొందరు కావాలని.. దీన్ని దెబ్బతీసేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా గోవా ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి ఈ చట్టం సరైన దిశలో ఒక అడుగు అంటూ అభిప్రాయపడ్డారు.

సవరించిన చట్టం దాని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చాలా కఠినమైన జరిమానాలు విధించనున్నారు. గతంలో నేరస్థులకు రూ. 50,000 వరకు జరిమానా విధించగా, కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు జరిమానాలు కనీసం రూ. 5,000 నుండి రూ. 1,00,000 వరకు ఉంటాయి. నేరం తీవ్రతను బట్టి, ఉల్లంఘించినవారు భారతీయ న్యాయ సంహిత, 2023 లోని సెక్షన్ 223 కింద కూడా ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..