AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GoFirst: కళ్లు చెదిరే ఆఫర్స్.. 1,199 లకే డొమెస్టిక్, 6,999 లకే ఇంటర్నేషన్ ఫ్లైట్ టికెట్.. వివరాలివే..

Go First Republic Day Sale 2023: ప్రముఖ విమానాయాన సంస్థ గోఫస్ట్.. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై భారీ రాయితీ..

GoFirst: కళ్లు చెదిరే ఆఫర్స్.. 1,199 లకే డొమెస్టిక్, 6,999 లకే ఇంటర్నేషన్ ఫ్లైట్ టికెట్.. వివరాలివే..
Go Firs
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2023 | 8:19 AM

Share

ప్రముఖ విమానాయాన సంస్థ గోఫస్ట్.. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై భారీ రాయితీ ప్రకటించింది. డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీలు 1,199, అంతర్జాతీయ ఛార్జీలు రూ. 6,599 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించింది. అంతేకాదండోయ్.. ఇక నుంచి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా ‘జీరో’ క్యాన్సలేషన్ ఫీజ్ ఆఫర్ ఇచ్చింది.

‘‘ప్రయాణం చేయడం మీ హక్కు, అందుబాటు ధరలో ఉండేలా మేము నిర్ధారిస్తాము. మా రిపబ్లిక్ డే సేల్‌తో మీకు ఇష్టమైన గమ్యస్థానాలకు వెళ్లండి! కేవలం రూ.1,199 (డొమెస్టిక్ అన్నీ కలుపుకొని), రూ.6,599 (అంతర్జాతీయ అన్నీ కలుపుకొని) తో ప్రారంభమయ్యే నమ్మశక్యం కాని తక్కువ ధరలతో మీ విమానాలను బుక్ చేసుకోండి.’’ అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి 12 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించడానికి.. జనవరి 23 నుండి జనవరి 29 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని గోఫస్ట్ ప్రకటించింది. అంతేకాదు.. ఆఫర్ కాల వ్యవధిలో.. విమానాల టిక్కెట్‌లను బుక్ చేసుకోవడమే కాదు.. ఉచితంగా రద్దు, ఉచితంగా రీషెడ్యూలింగ్ చేసుకునే అవకాశం కల్పించింది గోఫస్ట్.

నిబంధనలు, షరతులు..

1. బుకింగ్ వ్యవధి జనవరి 23 నుండి జనవరి 29 వరకు. 2. ఫిబ్రవరి 12 – సెప్టెంబర్ 30 నుండి ప్రయాణ కాలం. 3. నో-షో విషయంలో, వాపసు ఇవ్వడం జరుగదు. 4. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్‌తో కలపడం సాధ్యం కాదు. గ్రూప్ బుకింగ్‌లకు ఇది వర్తించదు. 5. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కాలానుగుణంగా క్యాన్సిల్, రీషెడ్యూల్ ఛార్జీలను మార్చే హక్కు Go Firstకి ఉంది. 6. ఇవి ప్రచార ఛార్జీలు, తదుపరి తగ్గింపు అనుమతించదు. 7. టిక్కెట్ క్యాన్సలేషన్ ప్రామాణిక నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. 8. సీట్లు బుకింగ్‌ల సమయంలో లభ్యతకు లోబడి ఉంటాయి. మొదట అందించిన లభ్యత ఆధారంగా ఉంటాయి. ప్రామాణిక బ్యాగేజీ విధానం వర్తిస్తుంది. 9. విమాన షెడ్యూల్, సమయాలు నియంత్రణ ఆమోదాలు, మార్పులకు లోబడి ఉంటాయి. 10. ఈ ప్రమోషన్ నేరుగా విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. 11. బ్లాక్-అవుట్ తేదీలు వర్తిస్తాయి. 12. కస్టమర్‌లకు ఎలాంటి సమాచారం లేకుండా ఆఫర్‌ను ఉపసంహరించుకునే హక్కు గో ఫస్ట్‌కు ఉంది.

మరిన్ని వివరాల కోసం GoFirst అధికారిక వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.

జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..