Republic Day: ప్రేయర్స్ ఆపేస్తారా? లేదా?.. స్కూల్ యాజమాన్యానికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న వీడియో..

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్కూ్ల్లో విద్యార్థులు.. ప్రార్థనలు చేయడం, వివిధ కాంపిటేషన్లలో పాల్గొనడం..

Republic Day: ప్రేయర్స్ ఆపేస్తారా? లేదా?.. స్కూల్ యాజమాన్యానికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న వీడియో..
Threates
Follow us

|

Updated on: Jan 27, 2023 | 8:01 AM

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్కూ్ల్లో విద్యార్థులు.. ప్రార్థనలు చేయడం, వివిధ కాంపిటేషన్లలో పాల్గొనడం, క్విజ్, న్యూస్ రీడింగ్‌లో కూడా పాల్గొంటుంటారు. పాఠ్యేతర కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమాలు చేపడుతాయి.

అయితు, గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలను నిలిపివేయాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని కొందరు ముస్లిం వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సదరు స్కూల్ యాజమాన్యం సైతం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తులు స్కూల్ ఉపాధ్యాయులను బెదిరించడంతో పాటు, స్కూల్లో ప్రేయర్స్‌ని ఆపేందుకు యత్నించారని ఉపాధ్యాయులు తమ ఫిర్యాదు పేర్కొన్నారు.

జనవరి 23 న జరిగిన ఈ సంఘటన ధోండివాలి పాలంపూర్‌లోని ఎన్ కొఠారి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలకు కొందరు సంఘవిద్రోహులు వచ్చి బీభత్సం సృష్టించారని, ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారని డివిజన్‌ ​​ప్రాథమిక విద్యాధికారికి ఇచ్చిన ఫిర్యాదులో ఉపాధ్యాయుడు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రార్థనలు ప్రారంభం కాగానే 10 నుంచి 12 మందితో కూడిన గుంపు పాఠశాలలోకి దూసుకెళ్లింది. తక్షణమే ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయులు, 500 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 150 మంది ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.

పాఠశాల మ్యూజిక్ టీచర్ మాట్లాడుతూ.. స్కూల్ ప్రేయర్ టైమ్‌లో ప్రతిరోజూ విద్యార్థులు మంత్రాలు, ప్రార్థనలు చేస్తారు. ఇతర కార్యకలాపాలలో క్విజ్ మొదలైనవి ఉంటాయి. అయితే, ప్రార్థన చేస్తున్న సమయంలో ఓ గుంపు లోపలికి ప్రవేశించింది. ప్రేయర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. వారి చర్యతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ డివిజన్‌ ​ప్రాథమిక విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..