AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘హే మీ బాస్ ఎక్కడున్నాడు?’.. చిలుకను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు..

వీరిది తెలివి అనాలా? అతి తెలివి అనాలో తెలియదు కానీ ఈ పోలీసోళ్లు చేసిన పని మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అవును, ఏదైనా కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టాలంటే..

Viral Video: ‘హే మీ బాస్ ఎక్కడున్నాడు?’.. చిలుకను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు..
Parrot
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2023 | 7:55 AM

Share

వీరిది తెలివి అనాలా? అతి తెలివి అనాలో తెలియదు కానీ ఈ పోలీసోళ్లు చేసిన పని మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అవును, ఏదైనా కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టాలంటే.. సంబంధిత వ్యక్తులనో, అనుమానిత వ్యక్తులనో అదుపులోకి తీసుకుని విచారిస్తారు పోలీసులు. కానీ, బిహార్‌లోని గయా పోలీసులు చేసిన పనిమాత్రం ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో బిహార్‌‌లో కల్తీ మద్యం సేవించి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో లిక్కర్ మాఫియా ఆటకట్టించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా లిక్కర్ అక్రమ రవాణా చేస్తున్న మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకునేందుకు ఇటీవల గయా పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఓ నిందితుడు అమృత్ మల్లా పరారీలో ఉండగా.. అతని ఇంట్లో పంజరంలో ఉన్న చిలుక కనిపించింది. అది గమనించిన పోలీసులు.. విచారణకు ఈ చిలుక ఏమైనా ఉపయోగపడుతుందేమో అని భావించారు. ఇంకేముంది.. ఆ చిలుకను స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్‌కు తీసుకువచ్చాక పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ‘హే చిలుకా.. మీ బాస్ ఎక్కడ? అతను ఎక్కడికి వెళ్లాడు. హూ చెప్పు’ అంటూ పోలీసులు చిలుకను విచారించారు.

గయాలోని గురువా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ కన్హయ్య కుమార్ నేతృత్వంలోని స్క్వాడ్ అమృత్ మల్లాహ్‌ను అరెస్టు చేయడానికి గ్రామంలోకి ప్రవేశించింది. అయితే, పోలీసులు అతని ఇంటికి వచ్చే సమయానికి, అతని కుటుంబం అప్పటికే వెళ్లిపోయింది. అతని పెంచుకునే చిలుక మాత్రమే ఇంట్లో ఉంది. అయితే, ఈ చిలుక తన యజమాని ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని చెబుతుందని ఆశపడ్డారు పోలీసులు. ఇంకేముంది.. దానిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ‘‘హే చిలుక, మీ యజమాని ఎక్కడ ఉన్నాడు? అమృత్ మల్లా ఎక్కడ ఉన్నాడు? అమృత్ మల్లాహ్ ఇంకా బతికే ఉన్నాడా? అమృత్ మల్లాహ్ ఎక్కడికి పోయాడు? మీ యజమాని ఎక్కడ ఉన్నాడు? వారు మిమ్మల్ని ఇంట్లో ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్లారు?’’ అని ఎస్‌ఐ కన్హయ్య కుమార్‌ను ప్రశ్నించారు.

అయితే, పోలీసుల ప్రశ్నలకు చిలుక నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేవలం ‘కటోర్’(గిన్నె) అని మాత్రం పదే పదే ఉచ్చరించింది. దాంతో పోలీసుల ఆశ కాస్తా నిరాశగా మారింది.

కాగా, ఈ వింత విచారణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పోలీసుల ఆలోచనా విధానానికి సలామ్ చెబుతున్నారు కొందరు. ఇంకొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us