Vande Bharat Trains: దక్షిణాది రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ రైళ్లు.. ఆ రూట్స్ ఇవే..

భారతదేశం అంతటా రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వే, కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా..

Vande Bharat Trains: దక్షిణాది రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ రైళ్లు.. ఆ రూట్స్ ఇవే..
అంటే సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
Follow us

|

Updated on: Jan 27, 2023 | 7:32 AM

భారతదేశం అంతటా రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వే, కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా.. రవాణా సంస్థ భారతదేశంలో సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లను పెంచుతోంది. ప్రస్తుతం, వందేభారత్ రైలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎనిమిది మార్గాల్లో నడుస్తోంది. ఈ రైళ్లను మరింత విస్తరించడానికి ఇండియన్ రైల్వేస్ యోచిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ కొత్త రైళ్లను దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు.

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ రైల్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో రెండవ రైలుగా నిలిచింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ రైలు చెన్నై-బెంగళూరు-మైసూరు మార్గంలో ప్రారంభించడం జరిగింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త మార్గం..

కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో నడపాలని ఆలోచిస్తోంది రైల్వే శాఖ. ఈ కొత్త రైళ్లు దక్షిణ భారతదేశంలోని 2 మార్గాలను కవర్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.

తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు, తెలంగాణలోని సికింద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని పూణే వరకు ఈ కొత్త రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది రైల్వే శాఖ. ఇక 2023 చివరి నాటికి దేశ వ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇక వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్యను 400కి పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

వందే భారత్ రైలు మార్గాలు:

ప్రస్తుతం, వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా 8 రూట్లలో నడుస్తున్నాయి. ఆ మార్గాలు ఇవే..

రూట్ 1: న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 2: న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (J&K) వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 3: గాంధీనగర్ – ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 4: న్యూ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

రూట్ 5: చెన్నై – మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 6: నాగ్‌పూర్ – బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 7: హౌరా – న్యూ జల్పాయ్‌గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 8: సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ రైలు ప్రత్యేకతలు:

వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. దీనిని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ఇది భారతీయ రైల్వేలు నడుపుతున్న ఎలక్ట్రిక్ మల్టిపుల్-యూనిట్, సెమీ-హై-స్పీడ్ ఇంటర్‌సిటీ రైలు. గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి దీనికి 52 సెకన్లు మాత్రమే పడుతుంది. వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్ గరిష్టంగా 220 kmph వేగంతో నడిచేలా డెవలప్ చేస్తున్నారు. పెరిగిన కార్యాచరణ భద్రత కోసం, వందే భారత్ 2.0 రైళ్లలో కవాచ్ (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్) అమర్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..