రాజీనామాకు సిధ్దపడిన గులాం నబీ ఆజాద్ !
తాజా కాంగ్రెస్ 'అసమ్మతివాది'గా ముద్ర పడిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్,, రాజీనామా చేసేందుకు సిధ్ధపడినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో..
తాజా కాంగ్రెస్ ‘అసమ్మతివాది’గా ముద్ర పడిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్,, రాజీనామా చేసేందుకు సిధ్ధపడినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో.. తనకు ఈ ‘వ్యవహారం’లో పాత్ర ఉందని తేలితే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించినట్టు తెలిసింది. కానీ ఈ లేఖను మాత్రం ఆయన సమర్థించారు. కపిల్ సిబల్ , శశి థరూర్, ఆజాద్, పృథ్వీ రాజ్ చవాన్, ఆనంద్ శర్మ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.
రాహుల్ గాంధీ ఫైర్:
ఈ లేఖపై సంతకాలు చేసినవారంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అసలే పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పైగా సోనియా ఆరోగ్యం బాగా లేనప్పుడు ఈ లెటర్ ను విడుదల చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ లేఖ పర్యవసానంగా తలెత్తిన ఉద్రిక్తతను సడలించేందుకు కొందరు నాయకులు సిడబ్ల్యూసీ సమావేశానికి ముందే సోనియాను కలుసుకునేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. 1999 లో సోనియా విదేశీయతను ప్రశ్నించి శరద్ పవార్ బయటకు వెళ్లి న తరువాత పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా..సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ ఆమోదించవచ్ఛునని కూడా తెలుస్తోంది.