Azadi ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకులకు లొంగడం ఇష్టంలేక.. ఆత్మహత్య చేసుకున్న విప్లవ వీరుడు ఆజాద్ చంద్రశేఖర్ జయంతి నేడు..

ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గణనీయ పాత్ర పోషించిన ఆయన నేటి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Azadi ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకులకు లొంగడం ఇష్టంలేక.. ఆత్మహత్య చేసుకున్న విప్లవ వీరుడు ఆజాద్ చంద్రశేఖర్ జయంతి నేడు..
Chandrashekhar Azad Birth A
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jul 27, 2022 | 2:54 PM

Azadi ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకుల నుంచి దేశ దాస్య శృంఖలాల విముక్తి కోసం పోరాడిన వీరుడు ఎందరో ఉన్నారు. అలాంటి విప్లవీరుల్లో ఒకరు చంద్రశేఖర్ ఆజాద్. నేడు ఆయన 116 వ జయంతి. ఈ సందర్భంగా దేశం ఆయన్ని స్మరించుకుంటుంది.  దేశ స్వాతంత్య్ర పోరాటంలో గణనీయ పాత్ర పోషించిన ఆయన నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు విప్లవీరుడిని స్మరించుకుంటూ ఆయన గురించి తెలుసుకుందాం..

23 జూలై, 1906న మధ్యప్రదేశ్‌లోని భాభా గ్రామంలో చంద్రశేఖర్ తివారీ జన్మించారు. 1920లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని విప్లవకారుడిగా తన స్వాతంత్య పోరాటంలో ప్రయాణాన్ని ప్రారంభించారు. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్ దారుణ మారణ కాండ చూసిన ఆజాద్ కదిలిపోయాడు. భారతదేశానికి స్వాతంత్య్ర పోరాటం కోసం పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణ ఉద్యమం అనంతరం..  రచయిత,  విప్లవ నాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఏర్పాటు చేసిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)లో ఆజాద్ చేరారు. చంద్రశేఖర్  అసోసియేషన్ ప్రధాన వ్యూహకర్తగా ఎదిగారు.

చంద్రశేఖర్ 116వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని కోట్స్ , ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం 

ఇవి కూడా చదవండి

ఇతరులు ఇతరులతో పోల్చుకోకండి.. ఎందుకంటే విజయం కోసం మీకు మధ్య మీకే జరిగే పోరాటం. నేను స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ప్రచారం చేసే మతాన్ని నమ్ముతానని చెప్పారు. అన్యాయాన్ని చూసి మీకు రక్తం పొంగకపోతే.. అది మీ సిరల్లో ప్రవహించే నీరు కింద లెక్క. ఒక విమానం భూమిపై ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.. అయితే అది భూమి మీద ఉండడం కోసం కాదు.. గొప్ప ఎత్తుకి చేరుకోవాలంటే  ఎల్లప్పుడూ జీవితంలో కొన్ని అర్ధవంతమైన రిస్క్‌లను చేయాల్సి ఉంటుంది.

చంద్ర శేఖర్ ఆజాద్ గురించి ఆసక్తికరమైన నిజాలు:

చంద్ర శేఖర్ సంస్కృత పండితుడు కావాలని అతని తల్లి  కోరుకుంది. దీంతో ఉన్నత చదువుల కోసం కాశీ విద్యాపీఠానికి వెళ్లారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి మొదటిసారిగా అరెస్టు అయ్యారు. అప్పుడు చంద్రశేఖర్ వయస్సు కేవలం 15 మాత్రమే. అప్పుడు శిక్షగా, అతనికి 15 కొరడా దెబ్బలు ఇచ్చారు.

జైలులో ఉన్న సమయంలో.. చంద్ర శేఖర్ తన పేరు ‘ఆజాద్’ (స్వేచ్ఛ), తన నివాసం ‘జైలు’..  తండ్రి పేరు ‘స్వతంత్రత’ అని చెప్పారు. అందుకనే చంద్రశేఖర్ పేరుకి ముందు ‘ఆజాద్’ వచ్చిందని చెబుతారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ విరామం తర్వాత ఆజాద్ HRAలో చేరారు. ఈ సంఘాన్ని బిస్మిల్, శచీంద్ర నాథ్ బక్షి, సచింద్ర నాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేశారు. కాకోరి రైలు దోపిడీలో ఆజాద్‌తో సహా హెచ్‌ఆర్‌ఏ ప్రమేయం ఉంది. అనతికాలంలోనే, ఆజాద్ అంచెలంచెలుగా ఎదిగి సంఘం ప్రధాన వ్యూహకర్తలలో ఒకడు అయ్యాడు. అతను HRA  కమాండర్-ఇన్-చీఫ్‌గా పదవిని చేపట్టారు. లాలా లజపతిరాయ్ మరణానంతరం భగత్ సింగ్  HRAలో జాయిన్ అయ్యారు. భగత్ సింగ్..  ఆజాద్‌తో కలిసి బ్రిటీష్ పాలకులకు  వ్యతిరేకంగా పోరాడటానికి విప్లవ వీరులను తయారు చేశారు. అప్పుడు ఈ సంస్థకు హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)గా పేరు మార్చారు. అలహాబాద్‌లోని ప్రసిద్ధ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఆజాద్ తన చివరి క్షణాలను గడిపారు.   27 ఫిబ్రవరి 1931న పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. బ్రిటిష్ పాలకులకు లోగిపోవడం ఇష్టం లేక తన రివాల్వర్‌తో తనని తానే కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం  ఈ పార్కును చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా మార్చారు. చంద్రశేఖర్ ఆజాద్ స్టాంప్ ను  1988 లో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు