CJI NV Ramana: మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ధోరణి సరికాదని హితవు

కొన్ని న్యూస్ ఛానెళ్లు, సోష‌ల్ మీడియా తీరుపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తంచేశారు. మీడియా, టీవీ చర్చల సందర్భంగా జరుగుతున్న విపరీత ధోరణులు ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు.

CJI NV Ramana: మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ధోరణి సరికాదని హితవు
Nv Ramana
Follow us

|

Updated on: Jul 23, 2022 | 2:14 PM

CJI NV Ramana on Media: గతంలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం ఆవశ్యకతను నొక్కిచెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. మరోసారి మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు, సోష‌ల్ మీడియా తీరుపై అసహనం వ్యక్తంచేశారు. మీడియా, టీవీ చర్చల సందర్భంగా జరుగుతున్న విపరీత ధోరణులు ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా జీరో అకౌంటబిలిటీ మాధ్యమంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ రాంచీలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ & రీసెర్చ్ ఇన్ లా నిర్వహించిన జస్టిస్ ఎస్‌బి సిన్హా స్మారక ఉపన్యాసంలో “Life of a Judge” (న్యాయమూర్తి జీవితం) పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రసంగించారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. బాధ్యతలను అతిక్రమించడం, ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారంటూ ఎన్వీ రమణ మీడియాను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయి జవాబుదారీతనం ఉందని.. అయితే ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదంటూ పేర్కొన్నారు. మీడియా హడావుడి కోర్టులను న‌డిపిస్తోంద‌ని.. కొన్ని కేసుల్లో అనుభ‌వ‌జ్ఞులైన జ‌డ్జిలు సైతం ఇవ్వలేని తీర్పుల‌ను మీడియా ఇస్తోందంటూ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు అప‌రిప‌క్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. మీడియాలో దూకుడుతనం, బాధ్యతారాహిత్యం మంచిది కాదంటూ చీఫ్ జ‌స్టిస్ సీరియ‌స్ అయ్యారు.

ఇటీవ‌ల కాలంలో న్యాయ‌మూర్తుల‌పై భౌతిక‌దాడులు పెరుగుతున్నాయ‌ని, ఎటువంటి రక్షణ లేకుండానే జ‌డ్జిలు స‌మాజంలో జీవించాల్సి వ‌స్తోంద‌ని రమణ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు ఆఫీస‌ర్ల రిటైర్మెంట్ త‌ర్వాత కూడా సెక్యూరిటీ క‌ల్పిస్తున్నార‌ని, కానీ జ‌డ్జిల‌కు ఇదే త‌ర‌హాలో రక్షణ కల్పించడం లేదన్నారు. న్యాయవ్యవస్థ ఖాళీలను భర్తీ చేయకపోవడం, న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచకపోవడమే దేశంలో కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణమని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..