RBI: ఈ నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా.. ఖాతాదారులు రూ.10వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు

Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానా విధిస్తోంది. అంతేకాదు బ్యాంకు లావాదేవీలపై..

RBI: ఈ నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా.. ఖాతాదారులు రూ.10వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు
Reserve Bank of India
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2022 | 2:56 PM

Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ జరిమానా విధిస్తోంది. అంతేకాదు బ్యాంకు లావాదేవీలపై కూడా ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని నాలుగు వేర్వేరు సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ఇందులో ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రాలపై పరిమితులను విధించింది. ఈ సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా జనతా సహకర బ్యాంక్, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి (పశ్చిమ బెంగాల్), బహ్రైచ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లపై ఆంక్షలు విధించింది. ఈ కారణంగా కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

సాయిబాబా జనతా సహకర బ్యాంకు ఖాతాదారులు రూ.20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. అలాగే సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ ఉపసంహరణ పరిమితి రూ. 50,000గా నిర్ణయించింది ఆర్బీఐ. నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు పెద్ద మొత్తంలో ఖాతా నుండి విత్‌డ్రా చేయలేరు. అదే విధంగా నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు ఇకపై తమ ఖాతా నుండి రూ.10,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. బిజ్నోర్‌కు చెందిన యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఆర్‌బిఐ అనేక ఆంక్షలు విధించింది. దీంతో కస్టమర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సహకార బ్యాంకులపై విధించిన ఆంక్షలు వచ్చే 6 నెలల పాటు కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 కింద నాలుగు సహకార బ్యాంకులకు ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. అలాగే నిబంధనలు పాటించని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై రూ. 57.75 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..