France: ఉన్నత విద్య చదువాలనుకునేవారికి స్వాగతం చెబుతున్న ఫ్రాన్స్.. ఇదిగో వివరాలు
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య చదవాలనుకునే ఇండియన్ విద్యార్థులకు ఆ దేశం దేశం శుభవార్త చెప్పింది. అయితే 2030 నాటికి దాదాపు 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. అయితే ఇటీవలే ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రధాని ఆ దేశంతో వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదేశాల మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం కార్యచరణను మొదలుపెట్టింది.

ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య చదవాలనుకునే ఇండియన్ విద్యార్థులకు ఆ దేశం దేశం శుభవార్త చెప్పింది. అయితే 2030 నాటికి దాదాపు 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. అయితే ఇటీవలే ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రధాని ఆ దేశంతో వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదేశాల మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం కార్యచరణను మొదలుపెట్టింది. ఎక్కువ మంది ఇండియన్ విద్యార్థులను ఆకర్షించేందుకు ఐదు సంవత్సరాల కాల పరిమితితో కూడినటువంటి షెంజెన్ అనే వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ చర్య వల్ల ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహ బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా మరోవైపు ఇండియన్ విద్యార్థుల కోసం ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ క్లాసెస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను జరుపనుంది. అలాగే విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఫ్రెంచ్ భాష.. ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ అనేది ఇవ్వనుంది. ఇక ప్యారిస్‌లో అధ్యక్షుడు మేక్రాన్.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కలిసి తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేందుకు మా బృందాలు చాలా కృషి చేస్తున్నాయని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ పేర్కొన్నారు. ఇక ఫ్రాన్స్ సమ్మిళిత, విభిన్నమైన దేశమని అందరికీ తెలిసిందే. అయితే ఇండియన్ విద్యార్థులతో మా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం.. ప్రపంచ స్థాయి విద్యావకాశాలను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. అలాగే ఫ్రాన్స్ ఎల్లప్పుడు ఇండియాకు ఒక ఫ్రెండ్‌లా ఉంటుందని చెప్పారు. అయితే ఈ అద్భుతమైన విద్యా జీవితాన్ని అందించడానికి అవసరమైన సాయం చేస్తుందని అన్నారు.
మరోవైపు త్వరలోనే ఫ్రెంచ్ రాయబార కార్యాలయం చెన్నై.. కొల్‌కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనుంది. అయితే అక్టోబర్‌లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తం 40కి పైగా ఫ్రెంచ్ ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు వీటికి హాజరుకానున్నారు. ఇక విద్యార్థులు సరైన కోర్సు ఎంచుకునేందుకు.. అలాగే తల్లిదండ్రు అనుమానాలను కూడా నివృతి చేసేందుకు వారు కావాల్సిన తోడ్పాటు అందజేస్తారని పేర్కొంది. ఇదిలా ఉండగా ఫ్రాన్స్‌లో చదివేందుకు ఇండియన్ విద్యార్థులకు ఆహ్వానం పలకడంపై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




