Virbhadra Singh: మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..
Ex CM Virbhadra Singh Dies: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ (87) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల

Ex CM Virbhadra Singh Dies: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ (87) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల 40 నిముషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వీరభద్రసింగ్.. దీర్ఘ కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ.. మరణించారు. వీరభద్రసింగ్ కొంతకాలం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ జనక్ రాజ్ వెల్లడించారు. వీరభద్రసింగ్ రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్నారని.. కొన్ని రోజులుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆరుసార్లు ముఖ్యమంత్రిగా…
1934 జూన్ 23న సిమ్లాలో జన్మించిన వీరభద్ర సింగ్.. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సోలన్ జిల్లాలోని ఆర్కీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2012 నుంచి 2017 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Mortal remains of former Himachal Pradesh CM & Congress leader Virbhadra Singh being taken to medical college for embalming (medical procedure).
Later, the mortal remains will be taken to his residence from Shimla’s Indira Gandhi Medical College and Hospital. pic.twitter.com/Q7RH7wJ4L2
— ANI (@ANI) July 8, 2021
Also Read: