Petrol Diesel Price: పెట్రోల్ రూట్‌లోనే డీజిల్.. తెలుగులో రాష్ట్రాల్లో భగ్గుమంటోన్న ఇందన ధరలు..
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతగా పెరిగిపోతున్నాయి. డీజిల్ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. పెట్రోల్ సెంచరీ కొడుతుందా.? అన్న చర్చ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా సెంచరీ దాటేసి మరీ దూసుకుపోతోంది.
Petrol-Diesel Rates Today: కొండ దిగి రావమ్మాఅంటూ ఎన్ని మొక్కులు మొక్కిన పెట్రోల్ ధరలు దిగిరావడం లేదు. రోజు రోజుకు మరింత పైకి ఎగబాగుతోంది. నెమ్మదిగా సెంచరీని దాటేసిన పెట్రోల్ సామాన్యులకు మంట పుట్టిస్తోంది. అదే బాటలో ఇప్పుడు డీజిల్ కూడా చేరబోతోంది. రూ. 99పైకి ఎగబాకింది. ఇక వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.68గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 104.56గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.71గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50ఉండగా.. డీజిల్ ధర రూ.97.68 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.05 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.25గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.106.37 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.26 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.105.47 ఉండగా.. డీజిల్ ధర రూ.98.16గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.52లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.50గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.90 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 106.66 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.26 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 100.56గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.59కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.18గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.65 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.37ఉండగా.. డీజిల్ ధర రూ.94.15గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.99 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.44 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.01గా ఉంది.