AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reservations: ఇంకా ఎన్ని తరాలు రిజర్వేషన్లు కొనసాగుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

Reservations: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు రోజువారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలపాటు కొనసాగుతాయని శుక్రవారం నాటి విచారణ.

Reservations: ఇంకా ఎన్ని తరాలు రిజర్వేషన్లు కొనసాగుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
Reservations
Subhash Goud
|

Updated on: Mar 20, 2021 | 2:02 PM

Share

Reservations: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు రోజువారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలపాటు కొనసాగుతాయని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తే తలెత్తే అసమానతలపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లపై పరిమితి విధించిన మండల్‌ తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాష్ట్ర తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. కోటాలను నిర్ధేశించే అంశాన్ని రాష్ట్రాలకే న్యాయస్థానాలు వదిలేయాలని ఆయన వాదించారు. ఆర్థికంగా వెనుకబడినపోయిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్న కేంద్ర సర్కార్‌ నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించిందని ఆయన అన్నారు.

కీలక వ్యాఖ్యలుచేసిన ధర్మాసనం

కాగా, ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు చెబుతున్నట్లు 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితి ఏమిటీ..? చివరగా దానిని మేం తేల్చాల్సి ఉంటుంది. ఈ అంశంపై మీ వైఖరి ఏమిటీ? ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు.. అని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. మండల్‌ తీర్పును పునఃసమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయని రోహత్గీ వాదించారు.

అయితే 1931తో పోల్చితే జనాభా అనేక రెట్లు పెరిగి 135 కోట్లకు చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచింది.. రాష్ట్రాలు చాలా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రకాల పథకాలు చేపట్టాయి. ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిపథకాలను చేపట్టాయి.. ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన వర్గాలు ముందుకు సాగలేదని మనం అంగీకరించగలమా’ అని వ్యాఖ్యానించింది. కాగా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలో ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రవీంద్ర భట్‌సభ్యులుగా ఉన్నారు.

ఇవీ చదవండి:

Medicines Prices Hike: ప్రజలకు షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు..

Aadhaar Stambh LIC Policy: అదిరిపోయే ఆధార్‌ పాలసీ .. నెలకు రూ.901 ప్రీమియంతో రూ. 4 లక్షల వరకు పొందండి