Medicines Prices Hike: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు..
Medicines Prices Hike: దేశంలో ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వంట నూనెలలు, కూరగాయాలు, పెట్రోల్, డీజిల్, తదితర వస్తువులన్నీ రోజురోజుకు పె..
Medicines Prices Hike: దేశంలో ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వంట నూనెలలు, కూరగాయాలు, పెట్రోల్, డీజిల్, తదితర వస్తువులన్నీ రోజురోజుకు పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. ఏది కొనాలన్నా.. కొనే పరిస్థితి లేకుండా పోతోంది. ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యుల పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఔషధ కంపెనీలకు మాన్యువల్ హోల్‌సేల్ ప్రైస్‌లో 0.5 శాతం పెంచుకునేందుకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రాసెసింగ్ అథారిటీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నొప్పి నివారణ మందులు, యాంటీఫ్లాటివ్, కార్డియాక్, యాంటీబయోటిక్స్‌తో పాటు ఇతర ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఔషధ తయారీ కంపెనీలకు యాన్యువల్ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యుపీఐ) ఆధారంగా ధరలలో మార్పులు చేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో మేముమి తక్కువ కాదన్నట్లు ఇప్పుడు ఔషధ ధరలు కూడా పెరగనున్నాయి.
కాగా, ఇప్పటికే అన్ని వస్తువులపై భారీగా ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే నిత్యావసర వస్తువుల, ఇతర వస్తువులు ఒక సమయంలో కొనుగోలు చేయకున్నా.. పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మందుల ధరలు ఎంత పెరిగిన అనారోగ్యం బారిన పడిన వారు తప్పకుండా కొనుగోలు చేసి తీరాల్సిందే. కరోనా మహహ్మారి కారణంగా ముందు ఆస్పత్రుల్లో ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు ఆస్పత్రికి వెళితే వారి జేబులకు చిల్లులు పడాల్సిందే. ప్రస్తుతం కరోనా సందర్భంగా ఆస్పత్రుల యజమానులు సైతం ధరలు విపరీతంగా పెంచేశారు. వైద్య చాలా ఖరీదైపోయింది. సామాన్యుడికి అందని వైద్యంగా మారిపోతుంది. ఇప్పుడు మందుల ధరలు పెరగడంతో మరింత భారం కానుంది.
ఇవీ చదవండి :
LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..