Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. మార్చి 27 నుంచి వరుస హాలిడేస్.. ఎన్ని రోజులో తెలుసా..

Bank Holidays : మీకు బ్యాంకులో ఏమైనా పని ఉందా.. అయితే తొందరగా కంప్లీట్ చేసుకోండి.. లేదంటే రోజులతరబడి వేచి చూడక తప్పదు. ఎందుకంటే మార్చి 27 నుంచి వరుస సెలవులు వస్తున్నాయి. బ్యాంకు

Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. మార్చి 27 నుంచి వరుస హాలిడేస్.. ఎన్ని రోజులో తెలుసా..
Bank Holidays
Follow us
uppula Raju

|

Updated on: Mar 23, 2021 | 3:53 PM

Bank Holidays : మీకు బ్యాంకులో ఏమైనా పని ఉందా.. అయితే తొందరగా కంప్లీట్ చేసుకోండి.. లేదంటే రోజులతరబడి వేచి చూడక తప్పదు. ఎందుకంటే మార్చి 27 నుంచి వరుస సెలవులు వస్తున్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. మిగతా రోజులన్ని సెలవుదినాలే.. ఏ ఏ రోజు సెలవు దినాలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఆర్బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. భారతదేశం అంతటా రెండో శనివారం, హోలీ పండుగ సందర్భంగా మార్చి 27-29 వరకు మూడు రోజులు బ్యాంకులు వరుసగా మూసివేస్తారు. మార్చి 30 సెలవుదినం కావడంతో పాట్నాలోని బ్యాంక్ శాఖలు వరుసగా నాలుగు రోజులు మూసివేస్తారు. ఇక మార్చి 31 అధికారిక సెలవుదినం కానప్పటికీ, ఇది ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి వినియోగదారులకు ఎటువంటి పనులను చేయరు. ఏప్రిల్ 1 ఖాతాలు మూసివేయడానికి కూడా హాలిడే ప్రకటించారు. ఇక ఏప్రిల్ 2 గుడ్‌ఫైడే సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఏప్రియల్ 3-వర్కింగ్ డే కాాగా  ఏప్రియల్ 4-ఆదివారం దీంతో ఖాతాదారులు గమనించి తొందరగా పనిచేసుకుంటే మంచిది.

మార్చి బ్యాంక్ సెలవులు: 27 మార్చి చివరి శనివారం, 28 మార్చి ఆదివారం, 29 మార్చి హోలీ హాలిడే. పాట్నా శాఖలో మార్చి 30 సెలవు, 31 మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు

ఏప్రిల్ బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1 బ్యాంకులు తమ వార్షిక ఖాతాలను మూసివేయడానికి వీలు కల్పించడం చేస్తాయి. ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, ఏప్రిల్ 13 గుధి పాద్వా / తెలుగు నూతన సంవత్సర దినోత్సవం / ఉగాది పండుగ , ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సర దినోత్సవం / విజు / బిజు పండుగ / చెయిరోబా / బోహాగ్ బిహు, ఏప్రిల్ 15 హిమాచల్ డే / బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవం / బోహాగ్ బిహు / సర్హుల్, ఏప్రిల్ 16 బోహాగ్ బిహు, ఏప్రిల్ 21 శ్రీ రామనవమి, గారియా పూజ

Telangana MLC Election Results 2021 LIVE: ఉత్కంఠగా కొనసాగుతున్న తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..