పంజాబ్ గ్రామాల్లో పశువులకు వింత వ్యాధి.. నోరు లేని మరో 13 మూగజీవాల మృతి

పంజాబ్ లోని లూథియానా గ్రామాల్లో పశువులకు కాలి , నోటికి వింత వ్యాధి సోకుతోంది. దీంతో ఇప్పటివరకు సుమారు 60 పశువులు మరణించాయి. ఈ జిల్లా పాయల్ సబ్ డివిజన్ లోని బెర్ కలాన్ గ్రామంలో గత 24 గంటల్లో మరో 13 పశువులు ఈ వ్యాధితో మరణించాయి.

పంజాబ్ గ్రామాల్లో పశువులకు వింత వ్యాధి.. నోరు లేని మరో 13 మూగజీవాల మృతి
Foot And Mouth Disease
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 09, 2021 | 2:03 PM

పంజాబ్ లోని లూథియానా గ్రామాల్లో పశువులకు కాలి , నోటికి వింత వ్యాధి సోకుతోంది. దీంతో ఇప్పటివరకు సుమారు 60 పశువులు మరణించాయి. ఈ జిల్లా పాయల్ సబ్ డివిజన్ లోని బెర్ కలాన్ గ్రామంలో గత 24 గంటల్లో మరో 13 పశువులు ఈ వ్యాధితో మరణించాయి. గతవారమే ఈ వ్యాధికారక వైరస్ కి దాదాపు 500 పశువులు గురయ్యాయని పశువైద్య అధికారులు తెలిపారు. త్వరితగతిన వ్యాపిస్తున్న ఈ వైరస్ నుంచి పశువులను రక్షించేందుకు వీటికి వ్యాక్సిన్ ఇస్తున్నట్టు వారు చెప్పారు. 14 పశు వైద్య బృందాలు సుమారు డజను గ్రామాలను సందర్శించి వీటి వ్యాక్సినేషన్ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ఈ వ్యాధికి గురైన వాటిని ఆరోగ్యకరంగా ఉన్న వాటికీ దూరంగా ఉంచాలని, రెగ్యులర్ గా అన్నింటికీ టీకామందు వేయించాలని పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీ.ఎస్.వాలియా వీటి యజమానులకు సూచించారు. వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం చాలా పశువులు కోలుకున్నాయని ఆయన చెప్పారు.

పశువులకు జ్వరం, కాళ్ళు, నోటిలో పుండ్లు లేదా బొబ్బలు వచ్చిన వెంటనే వెటర్నరీ డాక్టర్లకు చూపించాలని.\, నిర్లక్ష్యం చేయరాదని ఆయన అన్నారు. ఈ లక్షణాలు కలిగిన వాటిని ఐసోలేషన్ లో ఉంచాలన్నారు. బెర్ కలాన్ గ్రామంలో ఈ వ్యాధికి గురై తన మూడు పశువులు మరణించడంతో వాటి యజమాని ఉపాధి కరవై ఆత్మహత్య చేసుకున్నాడు. పాయల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లఖ్ వీర్ సింగ్ ఇతని కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి పరిహారంఇప్పించడానికి యత్నిస్తానన్నారు. అలాగే తమ పశువులు మరణించిన యజమానులకు కూడా పరిహారం లభించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Prabhas – Nag Ashwin Movie: త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్.. కీలక సన్నివేశాలన్నీ ఇందులోనేనట..

ICMR – NIV Recruitment: ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.