Telugu News India News Firing at Delhi's Saket court, Police rush injured woman to hospital, shooter disguised as lawyer
Gun Firing: ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం.. లాయర్ దుస్తుల్లో అగంతకుడి ఫైరింగ్.. పలువురికి తీవ్ర గాయాలు
రంజాన్ పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకల సృష్టించాయి. సాకేత్ కోర్టులో కాల్పులు జరగడంతో ఢిల్లీ వాసులు ఉలిక్కి పడ్డారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు కోటు మాటు నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా ఫైరింగ్ జరిపారు
రంజాన్ పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకల సృష్టించాయి. సాకేత్ కోర్టులో కాల్పులు జరగడంతో ఢిల్లీ వాసులు ఉలిక్కి పడ్డారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు కోటు మాటు నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా ఫైరింగ్ జరిపారు. దీంతో ఓ మహిళా కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఏం జరుగుతోందో తెలియక లాయర్స్ బ్లాక్‌లో ఉరుకులు పరుగులు పెట్టారు. కాల్పుల ఉదంతంతో సాకేత్ కోర్టు పరిసరాలు భీతావహంగా మారాయి. కాగా కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కాగా కాల్పులకు పాల్పడిన దుండగుడు హిస్టరీ-షీటర్ అని తెలుస్తోంది. అలాగే ఘటనకు సంబంధించిన కారణాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఆర్థికలావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన మహిళ న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందినట్టుగా అధికారులు గుర్తించారు.
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.