Fire Stunts: ఖతర్నాక్ స్టంట్ చేయబోయాడు.. కానీ అంతలోనే ఓ పొరపాటు.. ఇక అంతే ..!
ప్రమాదాలు ఎటునుంచి ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
Fire Stunts: ప్రమాదాలు ఎటునుంచి ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. కరాటే ప్రదర్శిస్తున్న సమయంలో అనుకోనుండా జరిగిన ప్రమాదంలో కరాటే మాస్టర్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందరు చూస్తుండగానే అగ్నికి ఆహుతి అయ్యాడు. ఈ హృదయవిధరక ఘటన తమిళనాడులో జరిగింది. కరాటే విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కరాటే చేస్తున్న మాస్టర్ మంటల్లో చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు మిగిలిన వారు ప్రయత్నించినా అప్పటికే మంటలు భారీగా వ్యాపించడంతో అతడు మృతి చెందాడు.
బాలాజీ అనే కరాటే మాస్టర్ తన స్టూడెంట్స్‌తో కలిసి ఓ మైదానంలో కరాటే ప్రదర్శన నిర్వహించాడు. అందులో భాగంగా చేతులకు మంటలను అంటించుకొని విన్యాసం చేయాలి. అనుకున్న విధంగా చేతులకు మంటలను అంటించుకొని విన్యాసం చేస్తుండగా ఆ మంటలు ఒక్కసారిగా అతడి ఒంటికి అంటుకున్నాయి. క్షణాల్లోనే ఆ మంటలు భారీగా వ్యాపించడంతో అతడు అక్కడే పడిపోయాడు. చుట్టూ ఉన్న అతని స్టూడెంట్స్ మాస్టర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు.. కానీ మంటలధాటికి అతడి దగ్గరకు వెళ్లలేకపోయారు. అందరూ చూస్తుండగానే మాస్టర్ మంటల్లో చిక్కుకుపోయారు. ఆ తర్వాత కొంత సేపటికి మంటలను ఆర్పి.. అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :