AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CJI NV Ramana:హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా కల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ 

కంపెనీల వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని(ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ హర్షం వ్యక్తం చేశారు.

CJI NV Ramana:హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా కల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ 
Cji Nv Ramana
KVD Varma
|

Updated on: Aug 20, 2021 | 6:59 PM

Share

Arbitration center: కంపెనీల వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని(ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన కల అని అన్నారు. పెట్టుబడిదారులలో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సులభతరం చేసిందని ఆయన చెప్పారు. మూడు నెలల్లోనే  తన కల నిజమైందని చెప్పిన సీజేఐ దీనికోసం కృషి చేసిన తెలంగాణా సీఎం కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు.

కంపెనీల వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మొదటి అడుగు. ప్రస్తుతం కంపెనీలు తమ అంతర్జాతీయ వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సింగపూర్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ కేంద్రం ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కోసం ట్రస్ట్ డీడ్ నమోదు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐ తోపాటు, సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, ఆర్. సుభాష్ రెడ్డి తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు

మొదటి అంతర్జాతీయ అర్బ్రిటేరియన్ సెంటర్ 1926 లో ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీలు మధ్యవర్తిత్వం కోసం సింగపూర్, దుబాయ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది అంతర్జాతీయ మధ్యవర్తులు విబేధాలను పరిష్కరించడానికి హైదరాబాద్ వస్తారు.  చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మూడు నెలల క్రితం మధ్యవర్తిత్వ సెటరును ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలని జస్టిస్ నాగేశ్వరరావును కోరారు. వీలైనంత త్వరగా అది పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం మూడు నెలలలోనే సీజేఐ కోరికను నెరవేరడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది  సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

దీనికోసం కావలసిన ఆర్థిక సహకారం అందిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీజేఐకి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా  మధ్యవర్తిత్వ చట్టం తన పదవీకాలంలో ఎలా ఏర్పడిందో ప్రస్తావించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక,  హైదర్‌బాద్ వంటి వాణిజ్య కేంద్రంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విజయమని మంత్రి కేటీఆర్ అన్నారు. అసాధ్యమనుకున్న విషయం  సాధ్యమైందని ఆయన అన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయడంపై అనేక కంపెనీలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఇది దేశాల మధ్య ప్రయాణించడానికి ఉన్న ఇబ్బందులను తగ్గిస్తుంది.

Also Read: Good News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా డీఏ పెంచుతూ ఉత్తర్వులు

Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఆయన పెట్టిన పోస్ట్‌ తొలగింపు.. ఎందుకంటే?