Good News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా డీఏ పెంచుతూ ఉత్తర్వులు

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త మోసుకువచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ నిర్ణయం..

Good News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా డీఏ పెంచుతూ ఉత్తర్వులు
Government Employees
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 20, 2021 | 6:06 PM

Central Autonomous Bodies Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త మోసుకువచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వారికి కూడా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు 28 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే తమకు కూడా డీఏ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కూడా డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐదు, ఆరో వేతర సవరణ సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా డీఏ పెంపు వర్తింపజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆయా ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర పభుత్వం ఉద్యోగులతో పాటు స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం 2020 ఏప్రిల్​ నుంచి డీఏ పెంపు నిలిపివేసింది. అయితే, ఏడాదిన్నరగా ఆగిపోయిన మూడు డీఏలను 2021 జూలై 1 నుంచి అమలు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ వచ్చింది. తొలి విడతలో ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల డీఏ పెంచిన కేంద్రం.. స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం దీన్ని వర్తింపజేయలేదు. దీంతో వారి నుంచి విజ్ఞప్తులు రావడంతో వారికి కూడా డీఏ పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎక్స్​పెండీచర్​ తాజాగా ఆఫీస్ మెమోరాండం (OM) కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రి శాఖ డైరెక్టర్​ నిర్మలా దేవ్​ మాట్లాడుతూ​ “ప్రస్తుతం 6వ వేతన సంఘం ప్రకారం జీతాలు తీసుకుంటున్న కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగుల డీఏ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఏ పెంపు 2021 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో వారి బేసిక్​ పే ప్రస్తుతమున్న 164 శాతం నుంచి 189 శాతానికి పెరుగుతుంది. 5వ వేతన సంఘం జీతాలు తీసుకుంటున్న కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది. వారి బేసిక్​ పే ప్రస్తుతమున్న 312% నుంచి 356% వరకు పెరుగుతుంది. అయితే, 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మద్య ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపు ఉండదు” అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

సవరించిన డీఏ రేట్లు 2020 జనవరి, 2020 జూలై 1, 2021 జనవరి 1 తేదీల నుంచి అమలు కావాల్సినవి. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో కేంద్రం వాటిని వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టి అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్​లో ఉన్న మూడు డీఏ బకాయిలను ఒకేసారి పెంచింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also…  Afghanistan Crisis: ఉస్కో అన్న పాక్ ఐఎస్ఐ..భారత ఎంబసీలపై తాలిబన్ మూకల దాడి..కీలక పత్రాలు..వాహనాల లూటీ!

ఆందోళనలో డాక్టర్స్.. కరోనా ట్రీట్మెంట్‌ లో కన్‌ఫ్యూజన్.. బయటపడుతున్న కొత్త లక్షణాలు..:Corona Third Wave Video.