Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాణి కమలాపతి – హజ్రత్ నిజాముద్దీన్ అనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం తెల్లవారుజామున భోపాల్‌కు బయలుదేరింది. అయితే ఉదయం 6.45 AM గంటలకు సీ-12 బోగీ చక్రాల నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. దీంతో రైలును విదిశ జిల్లాలోని నిలిపివేసి తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో బ్యాటరీ బాక్సుల్లో నుంచి మంటలు వచ్చినట్లు గుర్తించారు. అయితే మంటలు మాత్రం బ్యాటరీ బాక్స్‌లోనే వచ్చాయని.. వాటిని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రైలుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. మళ్లీ అన్ని తనిఖీలు పూర్తయ్యాక రైలు ఢిల్లీకి వెళ్తుందని పేర్కొన్నారు. అయితే మంటలు వచ్చినప్పుడు సీ-12 బోగీలో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి వందేభారత్ రైలు కూడా ఇదే. దీన్ని ప్రధాని మోదీ ఏప్రిల్ 1న ప్రారంభించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..




