Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నలకు శుభవార్త..! ఆడపిల్లలున్న తండ్రుల జీవితకాలం పెరుగుతుందట

అనేక కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే అరిష్టం భావిస్తారు. ఆడ పిల్లను భారంగా భావించి అబార్షన్లు చేయించడమో, పురిట్లోనే హతమార్చడమే చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. ఐతే తాజాగా ఓ అధ్యనం ఆడపిల్లల జననంపై ఆసక్తికర విషయం వెల్లడించింది..

Srilakshmi C

|

Updated on: Jul 17, 2023 | 10:29 AM

అనేక కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే అరిష్టం భావిస్తారు. ఆడ పిల్లను భారంగా భావించి అబార్షన్లు చేయించడమో, పురిట్లోనే హతమార్చడమే చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. ఐతే తాజాగా ఓ అధ్యనం ఆడపిల్లల జననంపై ఆసక్తికర విషయం వెల్లడించింది.

1 / 6
అదేంటంటే కూతురు ఉన్న కుటుంబంలో తండ్రి ఆయుష్శు పెరుగుతుందనేది అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతీ అమ్మాయి అన్ని ఆనందాలనే కాకుండా, తమ తండ్రి జీవితంలో కొన్నేళ్ల ఆయుష్శును సైతం పెంచగలరని తెల్పింది.

2 / 6
ఈ అధ్యయనం ప్రకారం.. ఆడపిల్లలు లేని వారి కంటే ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పేర్కొంది. పిల్లల జననాలు తల్లిదండ్రుల ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి తెలుసుకోవడానికి జాగిల్లోనియన్ యూనివర్సిటీ దాదాపు 4,310 మంది వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు.

3 / 6
వీరిలో 2,147 మంది తల్లులు, 2,163 మంది తండ్రులు ఉన్నారు. మగ పిల్లల జననాలు తమ తండ్రుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపలేదని పరిశోధనలో తేలింది. ఐతే ఆడపిల్లల జననాల సంఖ్య తండ్రి దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నట్లు బయటపడింది. ఎక్కువ మంది కుమార్తెలున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనం పేర్కొంది. ఒక్కో ఆడపిల్ల జననం వల్ల 74 వారాల ఆయుష్శు పెరుగుతుందట. కాబట్టి ఇది నాన్నలందరికీ గొప్ప శుభ వార్తగానే చెప్పాలి.

4 / 6
కానీ తల్లులకు మాత్రం ఇది వర్తించదు. అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ బయాలజీలో ప్రచురించబడిన మరొక అధ్యయనం ప్రకారం.. ఆడ/మగ పిల్లల ఇద్దరి జననాలు తల్లి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమేకాకుండా ఆమె జీవితకాలాన్ని తగ్గిస్తుందట. అవివాహితులైన మహిళలు సంతోషంగా ఉంటారని మరో అధ్యయనం వెల్లడించింది.

5 / 6
లింగంతో సంబంధం లేకుండా సంతానం కలిగిన తల్లిదండ్రులిద్దరి జీవితకాలం పెరుగుతుందని మరో అధ్యయనం పేర్కొంది. దాదాపు 14 ఏళ్లకు పైగా సేకరించిన డేటాలో సంతానం లేని వారితో సంతానం ఉన్న జంటలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తెల్పింది. అధ్యయనాలు ఎలా ఉన్నాఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతుందనేది కాదనలేని వాస్తవం. మన దేశంలో స్త్రీల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. లింగ వివక్షను రూపుమాపేందుకు, భ్రూణ హత్యల నివారణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మన సమాజంలో మార్పు ఎన్నటికి వస్తుందో..?

6 / 6
Follow us