Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలివే.!

South Central Railway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య అలెర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి పలు రైళ్ల సమయాల్లో మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే..

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలివే.!
Trains
Follow us

|

Updated on: Sep 29, 2021 | 9:10 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య అలెర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి పలు రైళ్ల సమయాల్లో మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం నడుస్తున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్‌గా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా మారనున్నట్లు ప్రకటించింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాల్సిందిగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. కొత్త మార్పులతో కూడిన రైళ్ల సమాచారాన్ని ఐ‌ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే కేవాడియా – ఎంజీఆర్ చెన్నై – కేవాడియా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను అక్టోబర్ 1వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఎక్స్‌ప్రెస్ నుండి సూపర్ ఫాస్ట్‌గా మారిన రైళ్లు..

  • సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్.
  • నర్సాపూర్ – నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్.
  • కాచిగూడ – మంగల్‌చెరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  • సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్.
  • కాకినాడ టౌన్ – భావనగర్ ఎక్స్‌ప్రెస్.
  • సికింద్రాబాద్ – హిసార్

ప్యాసింజర్ నుండి ఎక్స్ ప్రెస్‌గా మారుతున్న రైళ్లు..

  • కాజీపేట – సిర్పూర్ టౌన్
  • భద్రాచలం రోడ్ – సిర్పూర్ టౌన్
  • గుంటూరు – నర్సాపూర్
  • హైదరాబాద్ డెక్కన్ – పూణే
  • హైదరాబాద్ డెక్కన్ – ఔరంగబాద్
  • నాందేడ్ – తాండూరు
  • తాండూరు – పర్భాని
  • విజయవాడ – కాకినాడ పోర్ట్
  • గూడూరు – విజయవాడ
  • విశాఖపట్నం – కాకినాడ పోర్ట్
  • విజయవాడ -గూడూరు
  • గుంటూరు -కాచిగూడ
  • కాచిగూడ -రాయచూరు

వీటితో పాటు మరికొన్ని స్పెషల్ ట్రైన్స్‌‌ను ఇతర మార్గాల ద్వారా డైవర్షన్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు.

Also Read:

ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..

చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!