AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drug Case: డ్రగ్స్‌ దందాలో సింగం నటుడు అరెస్టు.. భారీగా మత్తు పదార్థాల స్వాధీనం

Drug Case: తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన 'సింగం' సినిమాలో కనిపించిన నైజీరియన్​ దేశస్థుడు, నటుడు చాక్​విమ్​మాల్విన్..​డ్రగ్స్​కేసులో కర్ణాటక పోలీసులకు..

Drug Case: డ్రగ్స్‌ దందాలో సింగం నటుడు అరెస్టు.. భారీగా మత్తు పదార్థాల స్వాధీనం
Subhash Goud
|

Updated on: Sep 30, 2021 | 5:50 AM

Share

Drug Case: తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలో కనిపించిన నైజీరియన్​ దేశస్థుడు, నటుడు చాక్​విమ్​మాల్విన్..​డ్రగ్స్​కేసులో కర్ణాటక పోలీసులకు దొరికిపోయాడు. బెంగళూరు కాడుగూండనహళ్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్​ఆయిల్ సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, పలు సినిమాల్లో.. చాక్​విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. అన్నబాండ్​, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్‌లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు. ముంబయిలో యాక్టింగ్‌లో శిక్షణ మెడికల్​వీసాపై భారత్‌కు వచ్చిన చాక్​విమ్​… ముంబయిలోని న్యూయార్క్​ ఫిల్మ్​అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలోనూ శిక్షణ పొందాడు.

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..

లాక్‌డౌన్‌ సమయంలో సినిమా అవకాశాలు రాకపోగా… చాక్​విమ్​ డ్రగ్స్​అమ్మకాలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, వ్యాపారులకు అతడు డ్రగ్స్​సరఫరా చేశాడని తెలిపారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్‌ను అతడు విక్రయించేవాడని పేర్కొన్నారు. కాడుగూండనహళ్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మత్తుపదార్థాలను విక్రయిస్తుండగా తాము రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఎవరెవరితో సంబంధం ఉంది?చాక్​విమ్​ఎన్నేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యవహారంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Hero MotoCorp: భారత్‌లో భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్‌ బైక్‌ల ధరలు.. కొత్త ధరల వివరాలు ఇవే..!

SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..