లూడో గేమ్‌లో ఓడించాడని.. తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో ఆట ఇప్పుడు ఓ తండ్రి, కుమార్తె మధ్య చిచ్చు పెట్టింది. లూడే ఆడే సమయంలో తన తండ్రి తనను మోసం చేశాడంటూ

  • Tv9 Telugu
  • Publish Date - 12:38 pm, Sun, 27 September 20
లూడో గేమ్‌లో ఓడించాడని.. తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు

Ludo Game Daughter: ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో ఆట ఇప్పుడు ఓ తండ్రి, కుమార్తె మధ్య చిచ్చు పెట్టింది. లూడే ఆడే సమయంలో తన తండ్రి తనను మోసం చేశాడంటూ 24 ఏళ్ల యువతి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఇటీవల వారిద్దరు గేమ్‌ ఆడే సమయంలో తండ్రి మోసం చేయడాన్ని ఆమె సహించలేకపోయింది.

దీంతో తన తండ్రిపై గౌరవాన్ని కోల్పోవడంతో పాటు నాన్న అని పిలిచేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదట. తన తండ్రిపై ఆమెకు ఎంతో నమ్మకం ఉండగా.. ఇప్పుడు మోసం చేశాడంటూ సదరు యువతి కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు కౌన్సిలర్ సరిత మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని సంతోషాన్నంతా ఇస్తానని తనకు మాటిచ్చిన తండ్రి, తనను మోసం చేశారంటూ కౌన్సిలింగ్‌లో ఆమె సరితకు చెప్పారట. ఈ విషయంలో సదరు యువతికి ఇప్పటికే నాలుగుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం సానుకూలంగా స్పందిస్తుందని సరిత అన్నారు.

Read More:

దుర్గం చెరువు బ్రిడ్జిపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్‌

‘ఆర్‌ఆర్‌ఆర్’‌లో చిన్నప్పటి చెర్రీ, ఎన్టీఆర్‌లు వీరే