Tamilnadu: పొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతుని అరెస్ట్ చేసిన పోలీసులు
Tamilnadu: తమిళనాడులో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో ఓ రైతు పెట్టిన ఎలుకల మందు తిని భారీగా నెమళ్లు(Peacock) మృతి చెందాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని పోలీసులు అరెస్ట్ చేశారు..
Tamilnadu: తమిళనాడులో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో ఓ రైతు పెట్టిన ఎలుకల మందు తిని భారీగా నెమళ్లు(Peacock) మృతి చెందాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూర్ జిల్లా (Tirupattur district) వాణియంబాడి పక్కనే ఉన్న నాచియార్ కుప్పం ప్రాంతానికి చెందిన షణ్ముగం (75) . కొన్ని నెలల క్రితం అదే ప్రాంతంలోని సావిత్రి అనే మహిళను నుంచి భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఈ క్రమంలో నెమళ్లు వ్యవసాయ పంటను ధ్వసం చేస్తున్నాయని.. గుర్తించాడు. దీంతో వాటి బారినుంచి పంటను కాపాడుకోవడం కోసం విషం కలిపిన ధాన్యాన్ని పొలంలో చల్లాడు. దీంతో అవి తిని నెమళ్ళు మరణించాయి. అయితే తమ పొలాన్ని చూడడం కోసం సావిత్రి కుమారుడు సిలంబరసన్ వెళ్ళినప్పుడు అక్కడ 12 నెమళ్లు మరణించి ఉండడం చూశాడు. దీంతో షాక్‌కు గురైన వెంటనే అలంగాయం అటవీశాఖకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖాధికారులు నెమళ్లకు విషం తిని చనిపోయిట్లు గుర్తించారు. ఆ నెమళ్లను స్వాధీనంలోకి తీసుకుని.. రైతు షణ్ముగంను అదుపులోకి తీసుకున్నారు. అలాగే చనిపోయిన నెమళ్లను పోస్ట్ మార్టం కు పంపించారు. అనంతరం దహనం చేసినట్లు అటవీశాఖ తెలిపింది. తిరుపతి జిల్లాలో నెమళ్లకు విషం పెట్టి చంపడం పరిపాటి. జాతీయ పక్షి నెమలిని చంపడం చట్ట విరుద్ధమైన చర్య అని, ఇటువంటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి చెప్పారు.
Loan Case: విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు