Viral Video: మీకు తెలుసా..? రైలు వెంట మహిళ దెయ్యం పరుగులు.! ఆ మహిళ రైలు వెంట ఎందుకు పరుగులు తీస్తోంది.?(వీడియో)
ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు, భయాలు, అనుమానాలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని విషయాలు చూసేంత వరకు నమ్మాలి అనిపించదు.. ఇంకొన్ని విషయాలు మాత్రం ఎక్కడైన చదివినా, విన్న చాలా భయాందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈరోజు మీకో
ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు, భయాలు, అనుమానాలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. అయితే వీటిలో కొన్ని విషయాలు చూసేంత వరకు నమ్మాలి అనిపించదు.. ఇంకొన్ని విషయాలు మాత్రం ఎక్కడైన చదివినా, విన్న చాలా భయాందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈరోజు మీకో ఓ మిస్టరీ రైల్వేస్టేషన్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ మిస్టరీ రైల్వే స్టేషన్‌లో మహిళ దెయ్యం ఉందన్న కారణంగా ఇక్కడ రైలు ఆపడం లేదు. కానీ.. గత 42ఏళ్లుగా ఈ స్టేషన్ గుండా వెళ్లే రైళ్ల వెంటా ఓ మహిళ పరుగులు తీస్తుందంటా. నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చూడండి మీకే అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న బెగన్ కోడార్ అనే గ్రామంలో ఓ చిన్న రైల్వే స్టేషన్ ఉంది. 1960లలో అక్కడ సంతల్ తెగకు చెందిన లచన్ కుమారి అనే రాణి రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం తనకున్న భారీ స్థలంలో కొంత స్థలాన్ని భారతీయ రైల్వేకు విరాళంగా ఇచ్చింది. తరువాత రైల్వే స్టేషన్ నిర్మించారు. రైళ్లు ఆగేవి. కానీ 1967లో ఆ రైల్వే స్టేషన్‌కు చెందిన మాస్టర్ విచిత్రంగా చనిపోయాడు. ముందు రోజు రాత్రి ఆ స్టేషన్‌కు సమీపంలోని రైలు పట్టాలపై అతను ఒక తెల్ల చీర ధరించిన మహిళను చూశాడని, తరువాత రోజు అతను చనిపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ కాస్తా దెయ్యాల స్టేషన్ గా మారింది. తరువాత అక్కడ రైళ్లను ఆపలేదు.
అయితే 2007లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ చొరవతో ఆ స్టేషన్‌ను మళ్లీ ఓపెన్ చేశారు. అయినపప్పటికీ ఆ స్టేషన్‌లో ఇప్పటికీ పర్మినెంట్ సిబ్బంది లేదు. సిబ్బంది ఉదయం పూజ చేశాకే స్టేషన్ లోపలకి వస్తారు. 1950లలో ఉపయోగించిన టిక్కెట్లనే ఇప్పటికీ అక్కడ ఇస్తున్నారు. నిత్యం ఆ స్టేషన్‌లో పగటి పూటే రైళ్లు ఆగుతాయి. 5రైళ్లు అక్కడ ఆగుతాయి. చివరి రైలు సాయంత్రం 5.45 గంటకు ఆగుతుంది. తరువాత అక్కడ ఎవరూ ఉండరు. నిత్యం 800 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌లో దిగుతుంటారు. ఇక సాయంత్రం 6 తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. అయితే ఈ వార్త ఆ నోట ఈ నోట పడి దేశం మొత్తం సంచలనంగా మారింది. దీంతో స్థానిక అధికారులతో పాటు పారా నార్మల్ అధికారులతో సహకారంతో ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లి పరిశోధనలు చేపట్టారు. రంగంలోకి దిగిన ఈ టీమ్.. రాత్రి సమయంలో ఆ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని, నెగిటీవ్ ఎనర్జీకోసం పరిశోధనలు చేశారు. కానీ వాళ్లకు అక్కడ దెయ్యం ఉందన్న ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. అంతేకాదు.. వాళ్ల వెంట తెచ్చుకున్న కెమెరాల, కేటో మీటర్లు కూడా ఎలాంటి ఎనర్జినీ నమోదు చేయలేదు. దీంతో అక్కడ ఎలాంటి దెయ్యాలు లేవని, తేల్చి చెప్పారు. ఈ రిపోర్ట్‌ను పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్‌కు తెలియజేయడంతో, 42ఏళ్ల తర్వాత తిరిగి బెగున్ కొదర్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఆపేందుకు కొత్త ప్రణాళిక రచించి, చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి ఈ స్టేషన్‌లో కేవలం ఉదయం సమయంలో మాత్రమే రైళ్లను ఆపుతున్నారు. ఇలా కేవలం ఓ మహిళ కారణంగాదాదాపు 42 సంవత్సరాలు ఈ స్టేషన్ నిర్మానుషంగా ఉండిపోయింది. అయితే ఇంతకీ ఆ మహిళ భ్రమా..? లేక పుకారా..? లేక భయమా..? అన్నది ఇప్పటి వరకు ఓ మిస్టరీగానే ఉంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..