Fake Indian Currency: ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు..చెలామణిలోకి భారీగా 500 నకిలీ నోట్లు

Fake Indian Currency: ప్రధాని మోడీ 2016 లో పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన కారణాలు నల్లధనం...

Fake Indian Currency: ఆర్బీఐ నివేదికలో  షాకింగ్ విషయాలు..చెలామణిలోకి భారీగా 500 నకిలీ నోట్లు
Fake Notes
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2021 | 5:00 PM

Fake Indian Currency: ప్రధాని మోడీ 2016 లో పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన కారణాలు నల్లధనం వెలుగులోకి, నకిలీ నోట్లను అరికట్టటానికి అని..దీంతో పాత రూ. 500, రూ, రూ 1000 నోట్లు చెల్లుబాటుకాకుండా పోయాయి. వీటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూ. 500 నోట్లను రెండు వేల రూపాయి నోట్లను ముద్రించింది. పాత నోట్ల కంటే సరికొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్లలో కొత్త రూ.500 నోట్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త నోట్ల సైజ్, కలర్ కూ భిన్నం.. వీటి వల్లన టెర్రరిజంను అరికట్టవచ్చని, అవినీతిని అంతం చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ కొత్త నోట్లను అనుకరిస్తూ.. నకిలీ డబ్బులను తయారు చేయడం కష్టమని.. మోడీ సర్కార్ చెప్పింది. అయితే కాలక్రమంలో ఆధునిక విజ్ఞానంతో దేనికిని నకిలీ సృష్టించవచ్చని.. తాజా పరిస్థితులతో అందరికీ అర్ధం అవుతుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

రోజు రోజుకీ నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంటోంది. మరీముఖ్యంగా దొంగ రూ.500 నోట్లు పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ నివేదికలో వెల్లడైంది. అయితే ఇతర కరెన్సీ నోట్లలో నకిలీ నోట్లు తగ్గాయని ఆర్బీఐ తెలిపింది. 2020-21లో ఆర్‌బీఐ 39,453 ఫేక్ రూ.500 నోట్లను గుర్తించింది. అలాగే 1.11 లక్షల నకిలీ రూ.100 నోట్లను గుర్తించింది. మొత్తంగా 2.09 లక్షల ఫేక్ బ్యాంక్ నోట్లను ఆర్‌బీఐ గుర్తించింది. 2020-21లో వార్షిక ప్రాతిపదికన చూస్తే.. రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ నోట్లు 31.4 శాతం మేర పెరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. అయితే గత ఏడాది తో పోలిస్తే.. ఇప్పుడు నకిలీ నోట్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉందని తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 విలువతో కరెన్సీ నోట్లను జారీ చేసింది. వ్యవస్థలో ఈ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అలాగే 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువతో నాణేలను విడుదల చేసింది. ఇవి కూడా చెలామణిలో ఉన్నాయి.

Also Read: కోనసీమ స్టైల్ లో రుచికరమైన ఆవపెట్టిన పనసపొట్టు కూర తయారీ విధానం