Covid-19: వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో తెలుగు రాష్ట్రాల్లో 66 మంది మృత్యువాత
Covid-19 second wave - 624 doctors died: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే.. కరోనా బాధితులను రక్షించే వైద్యులపై కూడా
Covid-19 second wave – doctors died: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే.. కరోనా బాధితులను రక్షించే వైద్యులపై కూడా ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటివరూ 66 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 624 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతి చెందారని ఐఎంఏ తెలిపింది.
ఈ మేరకు గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాలను వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్‌లో ఢిల్లీలో అత్యధికంగా 109 మంది మరణించారు. బీహార్‌లో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది వైద్యులు మృతి చెందినట్లు ఐఎంఏ ప్రకటించింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 748 మంది మృతి చెందారని ఐఎంఏ ఆవేదన వ్యక్తంచేసింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా బుధవారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,887 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,41,986కి చేరగా.. మృతుల సంఖ్య 3,37,989కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 17,13,413 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read;