భారత్ బయోటెక్ కోవాక్సిన్ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వోచ్చా ? భారత ప్రభుత్వం ఏం చెబుతోంది..

Fact Check: కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా యావత్ భారతాన్ని స్మశానాన్ని తలపించేలా చేస్తోంది. రోజూకీ 4 లక్షల కేసులు.. వేలాది మరణాలు..

  • Updated On - 11:21 am, Tue, 11 May 21 Edited By: Janardhan Veluru
భారత్ బయోటెక్ కోవాక్సిన్ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వోచ్చా ? భారత ప్రభుత్వం ఏం చెబుతోంది..
Covid Vaccine

Fact Check: కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా యావత్ భారతాన్ని స్మశానాన్ని తలపించేలా చేస్తోంది. రోజూకీ 4 లక్షల కేసులు.. వేలాది మరణాలు.. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సామాజిక దూరం, మాస్క్ ధరించడం మాత్రమే కరోనా నియంత్రణకు మార్గదర్శకాలు అని అటూ ప్రభుత్వాలు.. ఇటు డాక్టర్స్ సూచిస్తున్న ఇప్పటికీ ప్రజలు ఆ మాత్రం పాటించడం లేదు. దీంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే త్వరలోనే భారత్‏కు థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అందులో దాదాపు పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండబోతున్నట్లుగా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ కంటే ముందుగానే 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇదిలా ఉంటే.. దేశంలో పన్నెండు సంవత్సరాలు నిండిన పిల్లలకు భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్‏ను వేయడానికి భారత ప్రభుత్వం ఆమోదించిందని.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నిజాంగానే 12 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న వారికి టీకా వేయబోతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. అలాగే ఆ ట్వీట్ పై భిన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆ ట్వీట్ పై స్పందించింది. ఆ ట్వీట్ కేవలం ఫేక్ అని. పన్నెండు సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నవారికి టీకా వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే టీకా వేసేందుకు అనుమతి ఉందని ప్రభుత్వం తెలిపింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకా వేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో ప్రస్తుతం టీకా సరైన డోసులు లేనందున ఈ డ్రైవ్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుంది. అలాగే ఇటీవల డీసీజీఐ అత్యవసర ఉపయోగం కింద డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంట్ కోవిడ్ డ్రగ్ మెడిసిన్ కూడా అమోదించింది ప్రభుత్వం.

ట్వీట్..

Also Read: Rana Daggupati: శుభం కార్డు వేసిన రానా.. నెంబర్‌ వన్ యారీ సీజన్ 3కి ముగింపు పలికిన భల్లాల దేవా..

Happy Birthday Namitha: హీరోయిన్ నమిత పుట్టిన రోజు నేడు.. ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..