డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ సతీష్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించారు.
DRDO Chairman Sateesh Reddy: భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ సతీష్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించారు. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి 1985లో డీఆర్డీవోలో చేరారు. 2018లో డీర్డీవో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి హోమీ జహంగీర్ బాబా స్మారక అవార్డుతో పాటు పలు అవార్డులను ఆయన అందుకున్నారు.
Read More:
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ప్రభుత్వ ఉత్తర్వులు